ఉద్యోగులకు వార్షిక వేతనంలో 50 శాతం బోనస్
ప్రకటించిన ఎస్‌ఏఏఎస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ
Advertisement
ఉద్యోగులను శ్రమదోపిడీ చేసి లాభాలు గడించే యాజమాన్యాలే ఎక్కువగా ఉంటాయి.. కానీ తమ సంస్థ ఉన్నతి కోసం కష్టపడిన ఉద్యోగులకు భారీ బోనస్ ప్రకటించింది ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ. తమ సంస్థలో మూడేళ్ల ఉద్యోగ కాలపరిమితి పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వార్షిక వేతనంలో 50 శాతం బోనస్ ప్రకటించింది ఎస్‌ఏఏఎస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ. 140 మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ఉద్యోగులకు రూ.14.50 కోట్ల బోనస్ ఇస్తున్నట్టు వెల్లడించింది. 2022 డిసెంబర్ 31వ తేదీకి ముందు తమ సంస్థలో చేరిన ఉద్యోగులకు ఈ బోనస్ ఇస్తున్నట్టుగా సంస్థ సీఈవో శరవణ కుమార్ ప్రకటించారు.
Advertisement