భారీ లాభాల్లో సూచీలు
కెనడా, మెక్సికో దేశాలపై విధించిన టారిఫ్‌లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్లలో పాజిటివ్ సెంటిమెంట్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. కెనడా, మెక్సికో దేశాలపై విధించిన టారిఫ్‌లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్లలో పాజిటివ్ సెంటిమెంట్‌కు కారణమైంది. వాణిజ్య యుద్ధ భయాలు రేపిన ట్రంప్ నుంచే ఓ సానుకూల నిర్ణయం వెలువడటంతో ఆసియాతో పాటు మన మార్కెట్ సూచీలూ భారీ లాభాల్లో కానసాగడానికి ప్రధాన కారణమైంది.
సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 23,600 పాయింట్ల మార్కును దాటింది. మధ్యాహ్నం 2.15 గంటల సమయానికి సెన్సెక్స్ 1128.70 పాయింట్ల లాభంతో 78315.44 వద్ద కొనసాగుతున్నది. నిఫ్టీ 318.90 పాయింట్ల లాభంతో 23679.95 వద్ద ట్రేడవుతున్నది. సెన్సెక్స్ 30సూచీలో ఎల్‌అండ్‌టీ, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ లాభాల్లో కొనసాగుతుండగా.. జొమాటో, ఐటీసీ హోటల్స్, నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్, టైటాన్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.