రూ.6 లక్షల కోట్లు ఆవిరి

భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

Advertisement
Update:2025-02-10 16:53 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీగా నష్టపోవడంతో సోమవారం ఒక్కరోజులోనే బీఎస్‌ఈలో ఇన్వెస్టర్ల సంపద రూ.6 లక్షల కోట్లు ఆవిరి అయి రూ.418 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌ 548 పాయింట్లు, నిఫ్టీ 178 పాయింట్లు నష్టపోయాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్‌ 77,789.30 పాయింట్ల వద్ద నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభమైంది.. ఒకానొక దశలో 700 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ చివరికి కాస్త బలపడి 548.39 పాయింట్ల నష్టంతో 77,311.80 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 178.35 పాయింట్లు కోల్పోయి 23,381.60 పాయింట్ల వద్ద ముగిసింది. బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌, జొమాటో, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌ షేర్లు భారీగా నష్టపోగా, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మహీంద్ర, కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాలు గడించాయి.

Tags:    
Advertisement

Similar News