నష్టాలలో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
57 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.. 24 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ;
Advertisement
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధానాలు ప్రకటించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌లో జాగ్రత్తలు పాటిస్తున్నారు. దీంతోనే మార్కెట్లు స్వల్ప నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ 57,44 పాయింట్లు నష్టపోయి 78 వేల పాయింట్ల వద్ద, నిఫ్టీ 24.45 పాయింట్లు కోల్పోయి 23,578.90 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. భారతీ ఎయిర్ టెల్, బ్రిటానియా, హీరో మోటార్స్, అపోలో హాస్పిటల్స్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హిందూస్థాన్ యూనీలివర్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Advertisement