భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

ఎన్డీఏ కూటమి మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌ ఎఫెక్ట్‌ సూచీలపై కనిపించింది.

Advertisement
Update:2025-02-03 10:20 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. ఎన్డీఏ కూటమి మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌ ఎఫెక్ట్‌ సూచీలపై కనిపించింది. ఉదయం 10.15 గంటల సమయంలో సెన్సెక్స్‌ 655.08 పాయింట్లు కోల్పోయి 76850.88 వద్ద, నిఫ్టీ 235.60 పాయింట్ల నష్టంతో 23246.55 వద్ద కొనసాగుతున్నాయి. ప్రారంభంలో సెన్సెక్స్‌ 600 పాయింట్లకు పెన్‌డౌన్‌ అయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 87.16 వద్ద కొనసాగుతున్నది.

నిఫ్టీ సూచీలో మారుతీ సుజుకీ, ఐషర్‌ మోటార్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సురెన్స్‌, టైటాన్‌ కంపెనీ, నెస్లే సంస్థల షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి. హిందాల్కో, లార్సెన్‌, బీపీసీఎల్, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, టాటా స్టీల్ సంస్థలు నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. బడ్జెట్లో ఆదాయపు పన్ను ఉపశమనం కారణంగా వినియోగ ఆధారిత రంగాల షేర్లు సానుకూలంగా కదలాడుతున్నాయి. అటు వ్యవసాయ అనుసంధాన షేర్లు కూడా రాణిస్తున్నాయి. ఈ నెల 5-7 తేదీల్లో ఆర్‌బీఐ నేతృత్వంలో ద్రవ్యపరపతి విధాన సమీక్ష (ఎంపీసీ) నిర్ణయాలు శుక్రవారం వెల్లడవుతాయి. కీలక వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించొచ్చు అనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News