జే-సిరీస్ 349 సీసీ ఇంజిన్‌తో బుల్లెట్‌-350.. ఆగ‌స్టు 30న మార్కెట్లోకి లాంచింగ్‌..?!

త్వ‌ర‌లో రానున్న అప్‌డేటెడ్ రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ -350 బైక్ ప‌వ‌ర్ ట్రైన్ విత్ 5-స్పీడ్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్ క‌లిగి ఉంటుంది. కిక్ స్టార్ట్ (కేఎస్‌), ఎల‌క్ట్రిక్ స్ట్రార్ట్ (ఈఎస్‌) ఆప్ష‌న్లు, సింగిల్ పీజ్ సీట్‌, హ‌లోజెన్ హెడ్ ల్యాంప్‌, న్యూ స్విచ్‌గేర్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌తో వ‌స్తుంద‌ని తెలుస్తోంది.

Advertisement
Update:2023-07-23 15:25 IST

మోటార్ సైకిల్‌పై స‌వారీ..ఎంతో హాయిగా ఉంటుంది క‌దా.. అందునా రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ అంటే వేరే చెప్పాలా.. పాత‌త‌రం మోడ‌ల్ రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌తో పోలిస్తే.. ఇప్పుడు నాజుగ్గా ఉంటున్నాయి నూత‌న త‌రం ఎన్‌ఫీల్డ్ బుల్లెట్స్‌. కుర్రాళ్లు రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ మోటారు సైకిళ్ల‌పై మోజు పెంచుకుంటున్నారు. ఆ జాబితాలో 350సీసీ మోటార్ సైకిళ్లు వ‌చ్చి చేరాయి. పాత‌త‌రం ప్లాట్‌ఫామ్, ప‌వ‌ర్ ట్రైన్‌తో కూడిన బైక్‌తోపాటు అప్‌డేటెడ్ బుల్లెట్‌-350 బైక్ ఆవిష్క‌ర‌ణ‌కు రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ ప్రణాళిక రూపొందించింది. అధికారికంగా ధృవీక‌రించ‌కున్నా.. వ‌చ్చే నెల 30 లేదా సెప్టెంబ‌ర్ ఒక‌టో తేదీన రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ న్యూ జ‌న‌రేష‌న్ బుల్లెట్‌-350 ఆవిష్క‌రిస్తార‌ని తెలుస్తోంది.

అప్‌డేటెడ్ రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ 350 బైక్ 346సీసీ ఎయిర్‌కూల్డ్ సింగిల్ సిలిండ‌ర్ ఇంజిన్‌తో వ‌స్తున్న‌ది. ఈ ఇంజిన్ గ‌రిష్టంగా 19.36 పీఎస్ విద్యుత్‌, 28 ఎన్ఎం టార్చి వెలువ‌రిస్తుంది. రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ -350, హంట‌ర్‌-350, మీటోర్-350 బైక్స్‌లో జే-సిరీస్ 349 సీసీ ఇంజిన్ జ‌త చేశారు. జే-సిరీస్‌లో 349 సీసీ ఇంజిన్ గ‌రిష్టంగా 20.21 పీఎస్ విద్యుత్‌, 27 ఎన్ఎం టార్చి వెలువ‌రిస్తుంది. త్వ‌ర‌లో రానున్న అప్‌డేటెడ్ రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ -350 బైక్ ప‌వ‌ర్ ట్రైన్ విత్ 5-స్పీడ్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్ క‌లిగి ఉంటుంది. కిక్ స్టార్ట్ (కేఎస్‌), ఎల‌క్ట్రిక్ స్ట్రార్ట్ (ఈఎస్‌) ఆప్ష‌న్లు, సింగిల్ పీజ్ సీట్‌, హ‌లోజెన్ హెడ్ ల్యాంప్‌, న్యూ స్విచ్‌గేర్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌తో వ‌స్తుంద‌ని తెలుస్తోంది. గ‌త మోడ‌ల్ బైక్స్‌తో పోలిస్తే ఫ్యుయ‌ల్ గాజ్ ఫీచ‌ర్ జ‌త క‌లిపారు. లీట‌ర్ పెట్రోల్‌పై 38 కి.మీ. దూరం ప్రయాణిస్తుంద‌ని భావిస్తున్నారు.

2023 రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్-350 బైక్.. ఎంట్రీ లెవ‌ల్ హంట‌ర్‌-350ని దాటేస్తుంద‌ని భావిస్తున్నా, క్లాసిక్ 350 బైక్ కంటే వెన‌క‌బ‌డి ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇక హంట‌ర్‌-350 ప్ర‌స్తుతం రూ.1.5 ల‌క్ష‌లు (ఎక్స్ షోరూమ్‌) ప‌లుకుతుంది. క్లాసిక్-350 ధ‌ర రూ.1.93 ల‌క్ష‌ల నుంచి ప్రారంభం అవుతుంది. న్యూ జ‌న‌రేష‌న్ రాయ‌ల్ఎన్‌పీల్డ్ 350 బుల్లెట్ ధ‌ర‌ రూ. 1.7 ల‌క్ష‌ల నుంచి రూ.1.95 ల‌క్ష‌ల మ‌ధ్య ఉంటుందని అంచ‌నా వేస్తున్నారు.

ఫ్రంట్‌లో టెలిస్కోపిక్ స‌స్పెన్ష‌న్, రేర్‌లో ట్విన్ షాక్స్‌, సింగిల్ చానెల్ ఏబీఎస్‌తో వ‌స్తున్న అప్‌డేటెడ్‌ రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌-350 బైక్‌కు ఫ్రంట్‌లో 280 ఎంఎం డిస్క్ ఎట్ ఫ్రంట్‌, 153 ఎంఎం డ్ర‌మ్ డిస్క్ బ్రేక్ ఎట్ రేర్ క‌లిగి ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News