మార్కెట్‌లోకి కొత్త రూ.50 నోటు
ఆర్‌బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్ర సంతకంతో సర్క్యులేషన్‌లోకి
Advertisement
మార్కెట్‌లోకి కొత్త రూ.50 నోటను భారతీయ రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసింది. ఆర్‌బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్ర సంతకంతో ఈ నోటును సర్క్యులేషన్‌లోకి తీసుకువచ్చారు. మల్హోత్రా ఆర్‌బీఐ గవర్నర్‌గా రెండు నెలల క్రితం బాధ్యతలు స్వీకరించారు. కొత్త రూ.50 నోటు సర్క్యులేషన్‌లోకి వచ్చినా ఇప్పటి వరకు చెలామణిలో ఉన్న అన్ని రూ.50 నోట్లు చెల్లుబాటు అవుతాయని ఆర్‌బీఐ ప్రకటించింది. మహాత్మాగాంధీ సిరీస్‌తోనే కొత్త నోటును తీసుకువచ్చామని వెల్లడించింది.
Advertisement