మార్చి 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకర్స్ స్ట్రైక్
3వ తేదీన పార్లమెంట్ ఎదుట ధర్నా
మార్చి 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకర్ల స్ట్రైక్ నిర్వహిస్తున్నట్టు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటించింది. బ్యాంక్ ఉద్యోగులు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్ట్రైక్ నిర్వహిస్తున్నామని వెల్లడించింది. మార్చి 3వ తేదీన పార్లమెంట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని.. అయినా కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే దేశవ్యాప్తంగా స్ట్రైక్ చేయక తప్పదని హెచ్చరించింది. దేశంలోని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని, వారంలో ఐదు రోజులు మాత్రమే పని దినాలుగా ప్రకటించాలని, ఉద్యోగులు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలను నిలిపివేయాలని, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ లేవనెత్తిన ఇతర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ధర్నా, స్ట్రైక్‌కు పిలుపునిస్తున్నామని వెల్లడించింది.