రెండోరోజూ నష్టాల్లోనే సూచీలు

అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల ప్రభావం

Advertisement
Update:2024-10-16 10:27 IST

దేశీయ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు మన సూచీలపై ప్రభావం చూపెట్టాయి. దీంతో నేటి ట్రేడింగ్‌ను సూచీలు స్వల్ప నష్టాలతో ప్రారంభించాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 150 పాయింట్ల నష్టపోయి 81,677 వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ 38 పాయింట్లు కుంగి 25,019 వద్ద కొనసాగుతున్నది.

సెన్సెక్స్‌ 30 సూచీలో నెస్లే ఇండియా, ఎంఅండ్‌ఎం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టీసీఎస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐటీసీ, హెచ్‌సీఎల్‌, ఇన్ఫోసిస్‌ షేర్ల నష్టాల్లో కొనసాగుతున్నాయి. యాక్సిస్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌, ఎన్టీపీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. డాలర్‌ రూపాయి మారకం విలువ 84.06 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ విపణలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 74.40 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి. బంగారం ఔన్సు 2,682 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.

అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. నేడు ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. మరోవైపు విదేశీ సంస్థాగత మదుపర్లు కొనుగోళ్ల పర్వం దేశీయ మార్కెట్లపై కొనసాగుతున్నది. పరుసగా పన్నెండోరోజు కూడా అమ్మకాలు జరిపారు. మంగళవారం నికరంగా రూ. 1,749 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా..దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ. 1,655 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

Tags:    
Advertisement

Similar News