Mercedes-Benz | ఏఎంజీ జీటీ 4-డోర్ కూపేతో స‌మంగా మెర్సిడెజ్ ఆల్ న్యూ ఎల‌క్ట్రిక్ ఎస్‌యూవీ.. కావాలంటే 20 నెల‌లు ఆగాల్సిందే..!

Mercedes-Benz | ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న మెర్సిడెస్ బెంజ్ కార్ల‌కు భిన్నంగా ఉంటుందీ కొత్త‌గా వ‌స్తున్న ఎల‌క్ట్రిక్ ఎస్‌యూవీ. `విజ‌న్ ఏఎంజీ`తో వ‌స్తున్న ఎల‌క్ట్రిక్ ఎస్‌యూవీ మెర్సిడెస్‌-బెంజ్ ఏఎంజీ ఈవీ (Mercedes-Benz AMG EV) పెద్ద‌గా ఉంటుంది.

Advertisement
Update:2024-04-16 11:56 IST

Mercedes-Benz | ఎల‌క్ట్రిక్ కార్ల రంగంలోకి బ్రిట‌న్‌కు చెందిన‌ ప్ర‌ముఖ ల‌గ్జ‌రీ కార్ల త‌యారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ (Mercedes-Benz) ఎంట‌ర‌వుతోంది. ఏఎంజీ బ్యాడ్జ్ ఎల‌క్ట్రిక్ ఎస్‌యూవీ కారును మార్కెట్‌లోకి తేవ‌డానికి ప్ర‌ణాళిక రూపొందిస్తోంది. తొలుత హాఫ్ సెడాన్‌-హాఫ్ ఎస్‌యూవీ కారు త‌యారు చేయాల‌న్న ప్ర‌ణాళిక రూపొందించినా వెనుక‌డుగు వేసింది. కానీ తాజాగా ఏఎంజీ (AMG) బ్యాడ్జ్ ఎస్‌యూవీ కారు త‌యారీపై దృష్టిని కేంద్రీక‌రించింది. 1000 బీహెచ్‌పీ విద్యుత్ వెలువ‌రించే కెపాసిటీ గ‌ల విద్యుత్ మోటార్‌ను 2026లో మార్కెట్‌లోకి తేవాల‌ని సంక‌ల్పించింది. పూర్తిగా ఎల‌క్ట్రిక్ కార్ల కోసం జ‌ర్మ‌నీ ల‌గ్జ‌రీ కార్ల బ్రాండ్‌ ఏఎంజీ.ఈఏ ఆర్కిటెక్చ‌ర్ (AMG.EA architecture) ఆధారంగా రూపుదిద్దుకుంటుందీ ఎల‌క్ట్రిక్ కారు.

ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న మెర్సిడెస్ బెంజ్ కార్ల‌కు భిన్నంగా ఉంటుందీ కొత్త‌గా వ‌స్తున్న ఎల‌క్ట్రిక్ ఎస్‌యూవీ. `విజ‌న్ ఏఎంజీ`తో వ‌స్తున్న ఎల‌క్ట్రిక్ ఎస్‌యూవీ మెర్సిడెస్‌-బెంజ్ ఏఎంజీ ఈవీ (Mercedes-Benz AMG EV) పెద్ద‌గా ఉంటుంది. సుమారు 200 అంగుళాల వెడ‌ల్పుతో 118 అంగుళాల అల్లాయ్ వీల్ బేస్‌తో వ‌స్తోంది. లోట‌స్ ఎలెట్రే (Lotus Eletre), బీఎండ‌బ్ల్యూ ఎక్స్ఎం ప్ల‌గ్ ఇన్ హైబ్రీడ్ (BMW XM plug-in hybrid), త్వ‌ర‌లో రానున్న పొర్చే త్రీ రో ఎల‌క్ట్రిక్ ల‌క్సోబార్జ్ (Porsche luxobarge) వంటి కార్ల‌తో మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ కారు పోటీ ప‌డుతుంద‌ని భావిస్తున్నారు.

మెర్సిడెస్‌-బెంజ్ ఏఎంజీ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ త్వ‌ర‌లో బ‌య‌టకు వెల్ల‌డ‌వుతుంద‌ని భావిస్తున్నారు. ఆల్ వీల్ డ్రైవ్ (ఏడ‌బ్ల్యూడీ) సెట‌ప్‌తో ఉంటుంద‌ని తెలుస్తున్న‌ది. విద్యుత్ మోటార్ కెపాసిటీ వెల్ల‌డి కాకున్నా రెండు రెట్లు ఎక్కువ సామ‌ర్థ్యం ఉంటుంద‌ని భావిస్తున్నారు. అ కారు విద్యుత్ మోటారు గ‌రిష్టంగా 1000 బీహెచ్‌పీ కంటే ఎక్కువ విద్యుత్ వెలువ‌రిస్తుంద‌ని చెబుతున్నారు.

మెర్సిడెస్-బెంజ్ (Mercedes-Benz) రూపొందిస్తున్న ఎల‌క్ట్రిక్ ఎస్‌యూవీకి ఇంకా పేరు పెట్ట‌కున్నా, విజ‌న్ ఏఎంజీ (Vision AMG) తో వ‌స్తున్న‌ క‌ర్బ‌న ఉద్గారాల ర‌హిత ఎస్‌యూవీ ఏఎంజీ జీటీ 4-డోర్ కూపే (AMG GT 4-Door Coupe)తో స‌మానంగా ఉంటుంద‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే జ‌ర్మ‌నీలోని సిండెల్‌ఫింగెన్ మాన్యుఫాక్చ‌రింగ్ ప్లాంట్‌లో మెర్సిడెజ్‌-బెంజ్ కీల‌క ఏఎంజీ ఫ్యూచ‌ర్ స్ట్రాట‌ర్జీకి అనుగుణంగా పెర్ఫార్మెన్స్ ఫోక‌స్డ్ ఆల్ ఎల‌క్ట్రిక్ ఎస్‌యూవీ రూపుదిద్దుకుంటున్న‌ది.

Tags:    
Advertisement

Similar News