కాస్త కోలుకోకున్న స్టాక్‌ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన సూచీలు

Advertisement
Update:2025-01-28 16:59 IST

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం కాస్త కోలుకున్నాయి. సోమవారం భారీ పతనం చవిచూసిన సూచీలు వారంలో రెండో రోజు కాస్త పరవాలేదు అనిపించాయి. ఉదయం 75,659 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఒకనొక దశలో 862 పాయింట్ల లాభంతో 76,512.96 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సూచీ 535.24 పాయింట్ల లాభంతో 75,901.41 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 128.10 పాయింట్ల లాభంతో 22,957.25 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత క్షీణించింది. 22 పైసలు తగ్గి రూ.86.53 వద్ద ముగిసింది. టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు లాభాలు దక్కించుకోగా, ఐటీసీ, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎల్‌ అండ్‌ టీ, సన్‌ ఫార్మా షేర్లు నష్టాలు చవిచూశాయి.

Tags:    
Advertisement

Similar News