లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ కోసం మదుపర్ల ఆసక్తి

Advertisement
Update:2025-01-29 11:37 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. ప్రధాన షేర్లలో కొనుగోళ్లకు మదుపర్లు ఆసక్తి చూపెట్టడంతో సూచీలు రాణిస్తున్నాయి. మార్కెట్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 280 పాయింట్ల లాభంతో నిఫ్టీ 23 వేల ఎగువన ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ కోసం మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 77.13 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,770.60 డాలర్ల వద్ద కదలాడుతున్నది.

ఉదయం 11.30 గంటల సయంలో సెన్సెక్‌ 209.42 పాయింట్ల లాభంతో 76110.83 వద్ద.. నిఫ్టీ 128.15 పాయిట్లు పెరిగి 23085.40 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇన్ఫోసిస్‌, జొమాటో, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ, ఏషియన్‌ పెయింట్స్‌,టైటాన్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి.




Tags:    
Advertisement

Similar News