అమెరికన్‌లకు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రద్దు

ప్రెసిడెంట్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం

Advertisement
Update:2025-01-28 14:31 IST

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అమెరికన్‌లకు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రద్దు చేయాలని ఆయన నిర్ణయించినట్టుగా సమాచారం. రిపబ్లికన్‌ సెనెటర్ల సమావేశంలో ట్యాక్స్‌ రద్దుపై డొనాల్డ్‌ ట్రంప్‌ ఇండికేషన్‌ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అమెరికాకు సమకూరుతున్న ఆదాయంలో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ వసూళ్ల షేర్‌ ఎక్కువగానే ఉంది. ఇప్పుడు అమెరికన్‌లు సంపాదించే ఆదాయం నుంచి పన్ను వసూళ్లు నిలిపివేస్తే కస్టమ్‌ డ్యూటీ పెంపు ద్వారా దానిని భర్తీ చేసుకోవాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికన్‌లను సంపన్నులను చేసేందుకే ఆదాయపు పన్ను వసూళ్ల రద్దు నిర్ణయం తీసుకున్నానని ట్రంప్‌ వెల్లడించినట్టుగా తెలుస్తోంది. చైనా, ఇండియా, బ్రెజిల్‌ దేశాలు భారీగా పన్నులు వసూలు చేస్తున్నాయని తెలిపారు. అమెరికాలో అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని ట్రంప్‌ చెప్పినట్టుగా సమాచారం. బ్రిక్స్‌ దేశాలు తమ వాణిజ్య కార్యకలాపాల్లో డాలర్‌ను వినియోగించకుండా సొంత కరెన్సీ తేవాలని చూస్తే ఆయా దేశాలపై వంద శాతం పన్నులు విధిస్తామని అధ్యక్ష ఎన్నికలకు ముందే ట్రంప్‌ హెచ్చరించారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత డాలర్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు అమెరికన్లు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేలా పన్ను నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.

Tags:    
Advertisement

Similar News