లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ ..ప్రధాన షేర్లలో కొనుగోళ్లకు మదుపర్ల ఆసక్తి

Advertisement
Update:2025-01-28 10:11 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ ..ప్రధాన షేర్లలో కొనుగోళ్లకు మదుపర్లు ఆసక్తి చూపడంతో సూచీలు రాణిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. దీంతో సూచీలు మార్కెట్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 250 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 22,950 పైన ట్రేడింగ్‌ మొదలుపెట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 73.14 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,742.90 డాలర్ల వద్ద కదలాడుతున్నది.

ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్‌ 342.21 పాయింట్ల లాభంతో 75708.38 వద్ద.. నిఫ్టీ 48.75 పాయింట్లు పెరిగి 22877.90 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, జొమాటో షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సన్‌ ఫార్మా, ఎంఅండ్‌ఎం, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, మారుతీ సుజుకీ, ఐటీసీ, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News