Honda Elevate | హ్యుండాయ్ క్రెటాకు పోటీగా హోండా ఎలివేట్.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Honda Elevate | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ క్రెటాకు పోటీగా.. జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్.. ఎలివేట్ ఎస్‌యూవీ (Honda Elevate SUV) మార్కెట్లో ఆవిష్కరించింది. హోండా ఎలివేట్ కారు ధర రూ.10,99,900 (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. టాప్ హై ఎండ్ వర్షన్ ధర రూ.15,99,900 (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. హ్యుండాయ్ క్రెటాతోపాటు కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హై రైడర్ మోడల్ కార్లతో పోటీ పడుతుంది. దేశవ్యాప్తంగా తమ డీలర్‌షిప్‌ల వద్ద ఎలివేట్ కార్ల డెలివరీ ప్రారంభం అవుతుంది.
హోండా కార్స్ నుంచి భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన తొలి ఎస్‌యూవీ కారు.. హోండా ఎలివేట్ (Honda Elevate SUV). నాలుగు గ్రేడ్లలో ఏడు సింగిల్ టోన్, మూడు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఫోనిక్స్ ఆరెంజ్ పెరల్ (న్యూ కలర్), ఒబ్సిడియన్ బ్లూ పెరల్, రేడియంట్ రెడ్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెరల్, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్, లునార్ సిల్వర్ మెటాలిక్, మీటరాయిడ్ గ్రే మెటాలిక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా సీవీటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తోపాటు సింగిల్ పవర్ ట్రైన్ వర్షన్లలో అందుబాటులో ఉంటుంది. హోండా ఎలివేట్ (Honda Elevate SUV) 1.5 లీటర్ల ఐ-వీటెక్ డీవోహెచ్‌సీ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 89 కిలోవాట్లు (121 పీఎస్) విద్యుత్, 145 ఎన్ఎం టార్చి విత్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 7- స్పీడ్ కంటిన్యూయస్‌లీ వారియబుల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
హోండా ఎలివేట్ ధరలు ఇలా
ఎస్‌వీ ఎంటీ : రూ.10,99,900
వీ ఎంటీ : రూ. 12,10,900
వీఎక్స్ ఎంటీ : రూ.13,49,900
జడ్ఎక్స్ సీవీటీ : రూ.14,89,900
వీ సీవీటీ : రూ. 13,20,900
వీఎక్స్ సీవీటీ : రూ. 14,59,900
జడ్ఎక్స్ సీవీటీ : రూ. 15,99,900
మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (ఎంటీ) వేరియంట్ కారు లీటర్ పెట్రోల్ పై 15.31. కి.మీ, (ఏఎంటీ) వేరియంట్ 16.92 కి.మీ. మైలేజీ అందిస్తుంది. కారులో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, హోండా క్రోమ్ స్ట్రిప్, రాప్ అరౌండ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, లార్జ్ బ్లాక్ గ్రిల్లేతోపాటు 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి. మూడేండ్ల వరకు అపరిమిత వారంటీ, మరో ఐదేండ్లు ఎక్స్‌టెన్షన్ వారంటీ అందిస్తుంది. 10 ఏళ్ల వరకు రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఉంటుంది.
10.25-అంగుళాల ఐపీఎస్ హెచ్డీ డిస్ ప్లే, 7-అంగుళాల ఫుల్ కలర్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్ ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ స్మార్ట్ ఫోన్ చార్జర్, సన్ రూఫ్, సేఫ్టీ కోసం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ సహా అడాస్ సిస్టమ్ ఫీచర్లు, లేన్ వాచ్ కెమెరా, లేన్ కీప్ అసిస్ట్, స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, కొల్లిషన్ అవాయిడెన్స్ బ్రేకింగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
*