నేడు (18-12-2022) స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి మాత్రం..
Gold and Silver Rate Today 18 December 2022: దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.250 మేర పెరిగింది. దీంతో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,950కి చేరుకుంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరిగింది.
నేడు బంగారం, వెండి ధరలు 18 డిసెంబర్ 2022: దేశ ప్రజలతో బంగారం దోబూచులాడుతోంది. గత రెండు రోజులుగా నేల చూపులు చూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక బంగారం ధరలు నెమ్మదిగా దిగొస్తాయని చాలా మంది ఆశ పడ్డారు. కానీ వాళ్ల ఆశలు అడియాసలయ్యాయి. అంతకు ముందులాగే బంగారం తిరిగి పరుగు ప్రారంభించి.. సామాన్య ప్రజలను కలవర పెడుతోంది.
ఇక వెండి మాత్రం బంగారానికి పూర్తి వ్యతిరేకంగా పయనిస్తోంది. బంగారం ధరలు పెరగ్గా.. వెండి మాత్రం నేల చూపులు చూసింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం వరకు బులియన్ మార్కెట్‌లో నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.250 మేర పెరిగింది. దీంతో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,950కి చేరుకుంది.
ఇదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,490కు చేరుకుంది. ఇక దేశీయంగా కిలో వెండి ధర దాదాపు రూ.500 తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.69వేలకు చేరింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేస్తే..
22, 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు) వరుసగా..
హైదరాబాద్‌లో రూ.49,950.. రూ.54,490
విజయవాడలో రూ.49,950.. రూ.54,490
విశాఖపట్నంలో రూ.49,950 .. రూ.54,490
చెన్నైలో రూ.50,560.. రూ.55,160
కోల్‌కతాలో రూ.49,950.. రూ.54,490
బెంగళూరులో రూ.50,000.. రూ.54,540
కేరళలో రూ.49,950.. రూ.54,490
ఢిల్లీలో రూ.50,100.. రూ.54,640
ముంబైలో రూ.49,950.. రూ.54,490
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,000
విజయవాడలో రూ.73,000
విశాఖపట్నంలో రూ.73,000
చెన్నైలో కిలో వెండి ధర రూ.73,000
బెంగళూరులో రూ.73,000
కేరళలో రూ.73,500
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.69,000
ముంబైలో కిలో వెండి ధర రూ.69,౦౦౦
ప్రధాన నగరాలు | 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | వెండి ధర (కిలో) |
హైదరాబాద్ | 49,950 | 54,490 | 73,000 |
విజయవాడ | 49,950 | 54,490 | 73,000 |
విశాఖపట్నం | 49,950 | 54,490 | 73,000 |
ఢిల్లీ | 50,100 | 54,640 | 69,000 |
చెన్నై | 50,560 | 55,160 | 73,000 |
బెంగళూరు | 50,000 | 54,540 | 73,000 |
కోల్‌కతా | 49,950 | 54,490 | 69,000 |
ముంబై | 49,950 | 54,490 | 69,000 |
కేరళ | 49,950 | 54,490 | 73,500 |