Gold Rates | మ‌ళ్లీ పెరుగుతున్న బంగారం.. 10 రోజుల్లో రూ.1500 వృద్ధి.. రికార్డు స్థాయికి వెండి ధ‌ర‌.. కారణాలివేనా?!

Gold Rates | అమెరికా ఫెడ్ రిజ‌ర్వు వ‌డ్డీరేట్లు పెంచ‌క‌పోవ‌డంతో గ్లోబ‌ల్, దేశీయ మార్కెట్ల‌లో బంగారానికి గిరాకీ పెరిగింది. ఫ‌లితంగా గ్లోబ‌ల్ మార్కెట్లో ఔన్స్ బంగారం 2000 డాల‌ర్ల మార్క్‌ను దాటేసింది. గ‌త ప‌ది రోజుల్లో దేశీయ బులియ‌న్ మార్కెట్‌లో తులం బంగారం ధ‌ర రూ.1500 పెరిగింది.

Advertisement
Update:2023-11-23 15:30 IST

Gold Rates | దేశీయ బులియ‌న్ మార్కెట్లో బంగారం ధ‌ర‌లు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. గ‌త ప‌ది రోజుల్లోనే 2.5 శాతం పెరిగి మూడు వారాల గ‌రిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈనెల 13న హైద‌రాబాద్‌లో తులం బంగారం (24 క్యార‌ట్స్‌) ధ‌ర రూ.60,490 ప‌లికితే, గురువారం (న‌వంబ‌ర్ 23) రూ.62,020 వ‌ద్ద ట్రేడ‌యింది. ఈ నెల 15 వ‌ర‌కూ క్ర‌మంగా త‌గ్గిన బంగారం ధ‌ర.. ఆ త‌ర్వాత క్ర‌మంగా పెరుగుతూ వ‌చ్చింది. అంటే యూ -షేప్డ్ గ్రోత్ న‌మోదు చేసింది. హైద‌రాబాద్‌లో కిలో వెండి ధ‌ర రూ.79,200ల‌కు దూసుకెళ్లింది.

త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో ఆభ‌ర‌ణాల త‌యారీలో వినియోగించే 22 క్యార‌ట్ల బంగారం తులం ధ‌ర గురువారం రూ.57,400ల‌కు చేరితే.. ప‌ది గ్రాముల బంగారం (24 క్యార‌ట్స్‌) ధ‌ర రూ.90 పెరిగి రూ.62,600 వ‌ద్ద నిలిచింది. కిలో వెండి ధ‌ర రూ.79,200ల‌కు చేరుకున్న‌ది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో గురువారం తులం బంగారం (24 క్యార‌ట్స్‌) ధ‌ర రూ.62,170 వ‌ద్ద నిలిస్తే, ఆభ‌ర‌ణాల త‌యారీలో వినియోగించే 22 క్యార‌ట్ల బంగారం ధ‌ర రూ.57 వేలు ప‌లుకుతున్న‌ది. కిలో వెండి ధ‌ర రూ.200 పెరిగి రూ.76,200 వ‌ద్ద నిలిచింది.

క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు, ప‌శ్చిమ‌బెంగాల్ రాజ‌ధాని కోల్‌క‌తా, మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబై, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌య‌వాడ‌, ఒడిశా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్‌లో ఆభ‌ర‌ణాల త‌యారీకి ఉప‌యోగించే 22 క్యార‌ట్ల బంగారం తులం రూ.56,850 కాగా, 24 క్యార‌ట్ల బంగారం తులం ధ‌ర రూ.62,020 వ‌ద్ద నిలిచింది. కిలోవెండి ధ‌ర రూ.75 వేలు ప‌లుకుతున్న‌ది. ప‌శ్చిమ బెంగాల్ రాజ‌ధాని కోల్‌క‌తాలో కిలో వెండి ధ‌ర రూ.20 పెరిగి రూ.76,200 వ‌ద్ద నిలిచింది.

అమెరికా ఫెడ్ రిజ‌ర్వ్ వ‌డ్డీరేట్లు పెంచ‌క‌పోవ‌డంతో డాల‌ర్‌, యూఎస్ బాండ్ల విలువ య‌థాత‌థంగా కొన‌సాగ‌డంవ‌ల్ల అంత‌ర్జాతీయంగా బంగారం ధ‌ర‌లు భారీగా పెరిగాయి. గ్లోబ‌ల్ మార్కెట్‌లోనూ ఔన్స్ బంగారం ధ‌ర 2000.39 డాల‌ర్లు, గోల్డ్ ఫ్యూచ‌ర్స్ ధ‌ర ఔన్స్ 2002.40 డాల‌ర్లు ప‌లికింది. సూక్ష్మ‌, ఆర్థిక ప‌రిస్థితులు బంగారం ధ‌ర పెరుగుద‌ల‌కు కార‌ణ‌మ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అమెరికాలో ద్ర‌వ్యోల్బ‌ణం త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో వ‌డ్డీరేట్లు పెంపు నిలిచిపోవ‌చ్చున‌ని భావిస్తున్నారు. అమెరికా ఫెడ్ రిజ‌ర్వు వ‌డ్డీరేట్లతోపాటు మధ్య‌ప్రాచ్యంలో ఇజ్రాయెల్‌-హ‌మాస్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు కూడా బంగారం ధ‌ర‌లు పెర‌గ‌డానికి కార‌ణాల‌ని బులియ‌న్ మార్కెట్ విశ్లేష‌కులు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News