బడ్జెట్‌లో మంచి కెమెరా ఫోన్స్ ఇవే!
స్మార్ట్‌ఫోన్స్‌లో కెమెరా అనేది ముఖ్యమైన ఫీచర్. సోషల్ మీడియా వాడే యూత్ అంతా మంచి కెమెరా ఉండే ఫోన్ తీసుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్లకోసం ప్రస్తుతం బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ కెమెరా ఫోన్స్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.
స్మార్ట్‌ఫోన్స్‌లో కెమెరా అనేది ముఖ్యమైన ఫీచర్. సోషల్ మీడియా వాడే యూత్ అంతా మంచి కెమెరా ఉండే ఫోన్ తీసుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్లకోసం ప్రస్తుతం బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ కెమెరా ఫోన్స్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.
కెమెరా లవర్స్‌కు మోటొరోలా బ్రాండ్ మంచి ఆప్షన్. రూ. 25,000 లోపు బడ్జెట్‌లో మంచి కెమెరా ఫీచర్ల ఉన్న ఫోన్స్‌లో మోటోరొలా ఎడ్జ్ నియో ఒకటి. ఇందులో 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 13 ఎంపీ సెకండరీ కెమెరాతో పాటు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇందులో 6.55 అంగుళాల కర్వ్‌డ్ డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7030 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ధర సుమారు రూ.24,000 ఉంటుంది.
మోటొరోలా జీ 84
మోటొరోలా నుంచి అందుబాటులో ఉన్న మరో కెమెరా ఫోన్ జీ 84. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ సెకండరీ కెమెరా ఉంటుంది. అలాగే సెల్ఫీల కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇందులో 6.55 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ధర సుమారు రూ.20,500 ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54
పాతిక వేల లోపు బడ్జెట్‌లో మంచి కెమెరా పెర్ఫామెన్స్ అందిచే ఫోన్స్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 స్మార్ట్‌ఫోన్ కూడా ఒకటి. ఇందులో 108ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ, 2 ఎంపీ సెకండరీ కెమెరాలుంటాయి. సెల్పీల కోసం 32ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇది 6.7 అంగుళాల ఎల్‌ఈడీ డిస్ప్లేతో వస్తుంది. శాంసంగ్ ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ధర సుమారు రూ.24,000 ఉంటుంది.
రియల్‌మీ నార్జో 60 ప్రో
మంచి కెమెరా పెర్పామెన్స్ అందిస్తున్న మరో బెస్ట్ ఫోన్ రియల్‌మీ నార్జో 60 ప్రో. ఇందులో 100 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 2 ఎంపీ డెప్త్ సన్సర్ ఉంటుంది. సెల్ఫీ కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 6.7 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ధర సుమారు రూ. 24,000 ఉంటుంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 మొబైల్ లో 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ సెకండరీ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇందులో 6.7 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 782జీ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ధర సుమారు రూ.25,000 ఉంటుంది.
ఐకూ 7
ఐకూ 7 స్మార్ట్‌ఫోన్‌లో 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 13 ఎంపీ సెకండరీ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో డ్యుయల్ కలర్ ఎల్డీఈ ఫ్లాష్ ఫీచర్ కూడా ఉంది. అలాగే ఇందులో 6.62 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ధర సుమారు రూ.21,000 ఉంటుంది.
వివో వై200
కెమెరా లవర్స్ ఎక్కువగా ఇష్టపడే మరో బ్రాండ్ వివో. వివో వై200 స్మార్ట్‌ఫోన్‌లో 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 2 ఎంపీ డెప్త్ సెన్సర్ ఉంది. సెల్ఫీల కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 6.67 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ధర సుమారు రూ.22,000 ఉంటుంది.