Amazon Great Republic Day Sale | 13 నుంచి అమెజాన్ గ్రేట్ రిప‌బ్లిక్ డే సేల్స్‌.. స్మార్ట్ టీవీలు, ఫ్రిజ్‌ల‌పై 80 శాతం వ‌ర‌కూ రాయితీలు..!

Amazon Great Republic Day Sale | భార‌త్ 73వ గ‌ణ‌తంత్ర (Republic Day) దినోత్స‌వ సేల్స్‌.. మ‌రో రెండు వారాల్లో జ‌రుగ‌నున్నాయి.

Advertisement
Update:2024-01-11 09:23 IST

Amazon Great Republic Day Sale | భార‌త్ 73వ గ‌ణ‌తంత్ర (Republic Day) దినోత్స‌వ సేల్స్‌.. మ‌రో రెండు వారాల్లో జ‌రుగ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ జెయింట్ అమెజాన్ గ్రేట్ రిప‌బ్లిక్ డే సేల్ కూడా క‌స్ట‌మ‌ర్ల ముంగిట్లోకి వ‌చ్చేసింది. ఈ నెల 13 నుంచి అమెజాన్ గ్రేట్ రిప‌బ్లిక్ డే సేల్ ప్రారంభం అవుతుంద‌ని బుధ‌వారం అమెజాన్ ప్ర‌క‌టించింది. అమెజాన్ ప్రైమ్ స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు కొన్ని గంట‌ల ముందు రిప‌బ్లిక్ డే సేల్ ఆఫ‌ర్లు, డీల్స్ అందుబాటులో ఉంటాయి. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, టీవీలు త‌దిత‌ర ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాలను సెలెక్టెడ్ బ్యాంక్ కార్డు లావాదేవీల‌పై కొనుగోలు చేస్తే అద‌న‌పు డిస్కౌంట్లు పొందొచ్చు.

అమెజాన్ ప్ర‌త్య‌ర్థి సంస్థ ఫ్లిప్‌కార్ట్ రిప‌బ్లిక్ డే సేల్ ఈ నెల 14 నుంచి మొద‌ల‌వుతుంది. అమెజాన్ గ్రేట్ రిప‌బ్లిక్ డే సేల్ ఈ నెల 13 మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి ప్రారంభిస్తారు. అమెజాన్ ప్రైమ్ స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు 12 గంట‌ల ముందు ఇవే ఆఫ‌ర్లు ల‌భిస్తాయి. అమెజాన్ మ్యూజిక్‌, వీడియో స్ట్రీమింగ్ స‌ర్వీసుల‌తోపాటు ఒక‌టి, రెండు రోజుల ముందు ప‌లు ఉత్ప‌త్తులు కొనుగోలు చేసేందుకు అమెజాన్ ప్రైమ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ యాక్సెస్ ఇస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు, దాంతో ఈఎంఐ లావాదేవీల‌పై అమెజాన్ ద్వారా కొనుగోళ్లు చేస్తే 10 శాతం అద‌న‌పు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫ‌ర్ల కింద స్మార్ట్ ఫోన్లు, వాటి విడి భాగాల కొనుగోలుపై 40 శాతం, లాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, స్మార్ట్ వాచీలు, ఇత‌ర విడి భాగాల కొనుగోలుపై 75 శాతం డిస్కౌంట్ ల‌భిస్తుంది. స్మార్ట్ టీవీలు, వాషింగ్ మిష‌న్లు, రిఫ్రిజిరేట‌ర్లు, ఎయిర్ కండిష‌న‌ర్లు వంటి గృహోప‌క‌ర‌ణాల కొనుగోలుపై 65 శాతం వ‌ర‌కు డిస్కౌంట్ పొందొచ్చు. సంబంధిత వ‌స్తువుల ఎక్స్చేంజ్‌తో మ‌రింత డిస్కౌంట్ పొందొచ్చున‌ని అమెజాన్ తెలిపింది.

అమెజాన్ గ్రేట్ రిప‌బ్లిక్ డే సేల్‌లో ఆపిల్ ఐ-ఫోన్‌13పై భారీ డిస్కౌంట్ ఉంటుందని భావిస్తున్నారు. దీంతోపాటు శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 5జీ, వ‌న్‌ప్ల‌స్ 11 5జీ, వ‌న్‌ప్ల‌స్ నార్డ్3 5జీ, ఐక్యూ నియో 7ప్రో 5జీ, ఐక్యూ జ‌డ్‌7 ప్రో 5జీ, హాన‌ర్ 90 5జీ, మోటో రేజ‌ర్ 40 ఆల్ట్రా, రియ‌ల్‌మీ నార్జో 60ఎక్స్ 5జీ ఫోన్ల‌పై రాయితీలు ల‌భిస్తాయ‌ని తెలుస్తున్న‌ది. ఫ్లెక్సీబుల్ పేమెంట్ ఆప్ష‌న్ల‌తోపాటు 12 నెల‌ల పాటు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్ష‌న్ కూడా ఎంచుకోవ‌చ్చు. ఎక్స్చేంజ్ ఆఫ‌ర్ కింద రూ.50 వేల వ‌ర‌కు ఆఫ‌ర్ ల‌భిస్తుంది (పాత స్మార్ట్ ఫోన్ అప్‌గ్రేడ్ చేయ‌డానికి వెసులుబాటుగా ఉంటే). ఈ సేల్‌లో 5జీ స్మార్ట్ ఫోన్ ధ‌ర రూ.9,999 నుంచి ప్రారంభం అవుతుంది.

లాప్‌టాప్‌ల‌పై రూ.40 వేల వ‌ర‌కు ఆఫ‌ర్‌, హెడ్‌ఫోన్లూ స్పీక‌ర్లు, స్మార్ట్ వాచ్‌ల‌పై 80 శాతం వ‌ర‌కూ, టాబ్లెట్ల‌పై గ‌రిష్టంగా 60 శాతం డిస్కౌంట్ ఆఫ‌ర్ అందుబాటులో ఉంటుంది. వాటిలో హెచ్‌పీ లాప్‌టాప్ 14ఎస్ ధ‌ర రూ.38,990, డెల్‌15 లాప్‌టాప్ రూ.48,490, హెచ్‌పీ విక్ట‌స్ గేమింగ్ లాప్‌టాప్ రూ.68,990 ప‌లుకుతుంది.

నాయిస్ ఎండోవ‌ర్ స్మార్ట్ వాచ్ రూ.2,499, బోట్ లూన‌ర్ పీక్ రూ.2,299, టీవీఎస్ ఇయ‌ర్ బ‌డ్స్‌లో బోట్ ఎయిర్ డోప్స్ ఆటం రూ.899ల‌కు పొందొచ్చు. టాబ్లెట్ల‌లో శాంసంగ్ గెలాక్సీ టాబ్ ఏ9+ ధ‌ర రూ.19,999, ఫైర్ బోల్ట్ ఫోనిక్స్ ప్రో స్మార్ట్ వాచ్ రూ.1,199, సోనీ డ‌బ్ల్యూహెచ్‌-1000ఎక్స్ఎం5 హెడ్ ఫోన్లు రూ.24,990ల‌కు ల‌భిస్తాయి.

Tags:    
Advertisement

Similar News