వేల వేల ..
వెలుగు దివిటీల కాంతిచిమ్ముకుంటూ..
సూర్యరథం.
బయలు దేరింది....
చిమ్మ చీకట్లను
చెండాడుకుంటూ...
సప్తవర్ణాలలో..అరుణకాంతిని
మెలిక లు తిరిగిన
అడవి దారిన..
వార పోసుకుంటూ ..
కరిగిన బంగారంపు
ప్రవాహమేమో! అన్నట్లు..
అడవి తగలబడి పోతుందేమో!అన్నట్లు..
అడవి దొంగల స్వార్థం తో
తగలబడి..
మోడులై.కళతప్పిన
ఒకనాటి పచ్చని వృక్షాల..వేదన..
చుర కత్తుల్లాంటి.
కిరణ..విన్యాసం
దొంగల గుండెల్లో..
కాల్చినగునపాలయి..
భయపెట్టాయి..
నులి వెచ్చని చురుకుదనం..
వృక్షాలమేని లో
చైతన్యం పుట్టి
తల లెత్తి..
ప్రత్యక్ష నారాయణునికి..
ఎండిన చెట్టు కొమ్మల...
చేతులెత్తి
సూర్య నమస్కారం...
ఆచరించాయి ..
-పి .బాలా త్రిపుర సుందరి
Advertisement