నగరీకరణ తో
పల్లెల్లో సహజత్వాన్ని ,
పల్లెతనం లోని
నిర్మలత్వాన్నీ కోల్పోయి
కృత్రిమత్వముతో ,
తెలియని గాభరా తో
దిగాలుపడిన జీవితాలు
కోల్పోయిన ఆనందాలు
రేపటి బతుకు భయం
వలస బాట పడుతున్న
కుటుంబాలు ...
నేను చూసే నిస్సహాయ చూపులు
పల్లెను వదలి వెళ్ళవద్దు
అంటున్న నా మొర ఆలకించారా!
మీరు ఒకసారైనా
వెనుదిరిగి చూసారా!
నేను ప్రేమతో చాచిన
నా చేతుల లోకి మీరు రండి!
నా పరిష్వంగం లోకి మీరు చేరండి!
ఎప్ప టిలా నేను
మిమ్మల్ని కాపాడు కుంటాను!
నన్ను నమ్మండి!..
వెనక్కు తిరిగి చూస్తే నాబాధ...
మీకు అర్థమవుతుంది.
దుమ్ము రేపుకుంటూ
ఊరు దాటుతున్న బస్సులో ఉన్న
మీరు నన్ను చూడలేదు!
నేను నిస్సహాయంగా మిగిలి పోయాను!
- పి .బాలాత్రిపుర సుందరి
Advertisement