జర.. భద్రం!

Advertisement
Update:2023-07-28 23:18 IST

నింగి నేల కలిసిన చోట ఓ వెలుగు ముద్ద లోపలికి చొచ్చుకు పోతోంది!

వెలుగు ముద్ద వెళుతుంటే .

చుట్టూ నల్లటి

నిశీ ధం..కప్పుతుంటే..

గుబెలేస్తోంది..ఎందుకూ?

కొండ శిఖర పు చివరి అంచు మీద నిశ్చేష్టవయి .

ఒంటరిగా నిలబడ్డా వెందుకూ? చెప్పమ్మా,!"

ఇప్పటి దాకా..నీ నీడ గొడుగయ్యింది..

నీవు నిలిచిన నేల పానుపయ్యింది..

నీ కొమ్మలు..ఆకులు..

గాలితో ఆటలాడాయి..

నీ చల్లదనం

హాయి నిచ్చింది.. కదమ్మా,,!

నేను నీ వళ్ళో వాలి తే,

గాలితో కలిసి జోలపాట

పాడావు కదమ్మా!!..

వెలుగు మామయ్య వెళ్లిపోతే ..

వెన్నెల మామయ్య వస్తాడు కదమ్మా!.

దిగులుగా ఉన్న..

అమ్మ చెట్టుని ..

దిగులెందుకో తెలియని..

ఓచిన్ని మొలక..

ప్రశ్నల పరంపరకొనసాగింది..

తల్లి..మనసు తల్ల డిల్లింది .

వెలుగు మామయ్య

వెన్నెల మామయ్య కలసిన

చీకటి రాత్రి..అమాస రాత్రి ..

ఈ రోజు..

పక్షులు..నిద్దరోతున్న వేళ ..

అంతా..చీకటి..

అమాస..రాత్రైన వేళ..

అడవి దొంగలు మెకముల వోలె. అడవిన బడి ..

గొడ్డళ్ళ తో మా చేతులూ కాళ్లూ నరికి

మా నడిమి మేనిని

దుంగలుగా మార్చి

బండ్లల యేసి.

అడివి దాటించి...

ఖరీదు కట్టి ..

మమ్మల్ని అమ్మకం ఎడతరమ్మా!

చిన్న మొలకవి బిడ్డా!

నే లేక అలమటిస్తవో ! ఏమో!.. ఎట్లుంటవో..బిడ్డా!

బర్రున బారుగా ఎదగకు బిడ్డా!

దొంగ ఎదవల కన్ను

నీ మీద బడతదో..ఏమో!

కన్ను మూయకుండ..

జర భద్రం గుండాల,! పదిలంగుండాల!

కోడి కూయంగానే..పక్షులు..

కిచ కిచలతో..

నామీద..వాలి..సందడి..చేస్తాయి..

వెలుగు మామయ్య..

వస్తున్నాడని..గుర్తుగా..

అప్పటికి నా కేమీ కాకుంటే..

నిమ్మల మవుతాము.. బిడ్డా,!

జర సడి జేయక

నా చేతుల మీద. పడుకో!

కొమ్మలతో కప్పేసి..దాచుకుంటా..!

పదిలం చెప్పింది..

అమ్మ చెట్టు...

ఓ మొలక బిడ్డకి,!

పి .బాలాత్రిపురసుందరి

(హైదరాబాద్)

Tags:    
Advertisement

Similar News