హడావిడి లేకుండా వైసీపీ నాలుగో లిస్ట్ విడుదల..

హోం మంత్రి తానేటి వనితకు కూడా స్థాన చలనం తప్పలేదు. ఆమెను తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి గోపాలపురంకు పంపించారు. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావును కొవ్వూరుకు మార్చారు.

Advertisement
Update:2024-01-19 07:39 IST

వైసీపీ మొదటి మూడు లిస్ట్ ల విడుదలలో చాలా ఉత్కంఠ నెలకొంది. తాడేపల్లి వద్ద నాయకుల పడిగాపులు, అలకలు, బుజ్జగింపులు, అసంతృప్తులు, హైడ్రామాలు.. ఇలా చాలా సన్నివేశాలు జరిగాయి కానీ నాలుగో లిస్ట్ అలాంటి సంచలనాలేవీ లేకుండానే విడుదలైంది. ఇంతకీ నాలుగో లిస్ట్ లో ఎవరెవరి పేర్లున్నాయి..? ఎవరెవర్ని మార్చేశారు..?

వైసీపీ నాలుగో లిస్ట్ లో ఒక్క కనిగిరి మినహా మిగతావన్నీ ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు. 8 అసెంబ్లీ ఒక్క లోక్ సభ స్థానాలకు ఈ లిస్ట్ లో ఇన్ చార్జ్ లను ప్రకటించారు. చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న రెడ్డెప్పను జీడీ నెల్లూరుకు పంపించారు. జీడీ నెల్లూరు ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణ స్వామిని ఈసారి చిత్తూరు లోక్ సభకు ఇన్ చార్జ్ గా నియమించారు. హోం మంత్రి తానేటి వనితకు కూడా స్థాన చలనం తప్పలేదు. ఆమెను తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి గోపాలపురంకు పంపించారు. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావును కొవ్వూరుకు మార్చారు.


అసెంబ్లీ స్థానం - ఇన్ చార్జ్

1. జీడీ నెల్లూరు (ఎస్సీ) - ఎన్‌ . రెడ్డెప్ప

2.శింగనమల (ఎస్సీ ) - ఎం. వీరాంజనేయులు

3. నందికొట్కూరు (ఎస్సీ ) - డాక్టర్‌ సుధీర్‌ దారా

4. తిరువూరు (ఎస్సీ ) - నల్లగట్ల స్వామిదాస్‌

5. మడకశిర (ఎస్సీ ) - ఈర లక్కప్ప

6. కొవ్వూరు (ఎస్సీ ) - తలారి వెంకట్రావు

7. గోపాలపురం (ఎస్సీ ) - తానేటి వనిత

8. కనిగిరి - దద్దాల నారాయణ యాదవ్‌

మొత్తం నాలుగు జాబితాలతో కలిపి 58 అసెంబ్లీ, 10 లోక్‌ సభ స్థానాలకు వైసీపీ సమన్వయకర్తలను ప్రకటించింది.

Tags:    
Advertisement

Similar News