నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి

ఇక కీలకమైన మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా బీసీ మహిళ మురుగుడు లావణ్యకు బాధ్యతలు అప్పగించింది.

Advertisement
Update:2024-03-01 21:43 IST

నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి

అసెంబ్లీ ఇన్‌ఛార్జిల మార్పులు, చేర్పుల కార్యక్రమంలో భాగంగా తొమ్మిదో జాబితాను విడుదల చేసింది వైసీపీ. ఇందులో భాగంగా తాజాగా రెండు అసెంబ్లీ, ఓ ఎంపీ స్థానానికి ఇన్‌ఛార్జిలకు ప్రకటించింది. అనూహ్యాంగా నెల్లూరు ఎంపీ స్థానానికి ఇన్‌ఛార్జిగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి బాధ్యతలు అప్పగించింది. గతంలో విజయసాయిరెడ్డి అల్లుడి అన్న శరత్‌ చంద్రా రెడ్డి పేరు ప్రకటిస్తారని ప్రచారం జరిగింది.

ఇక కీలకమైన మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా బీసీ మహిళ మురుగుడు లావణ్యకు బాధ్యతలు అప్పగించింది. గతంలో గంజి చిరంజీవిని ఇన్‌ఛార్జిగా ప్రకటించిన వైసీపీ.. మరోసారి చర్చలు జరిపి లావణ్యకు బాధ్యతలు అప్పగించింది. ఈ సమావేశానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఎమ్మెల్సీ మురుగుడు, ప్రస్తుత వైసీపీ ఇన్‌ఛార్జి గంజి చిరంజీవి పాల్గొన్నారు.

ఇక కర్నూలు అసెంబ్లీ స్థానానికి రిటైర్డ్ IAS AMD ఇంతియాజ్‌కు బాధ్యతలు అప్పగించింది వైసీపీ హైకమాండ్. ఇటీవల VRS తీసుకున్న ఇంతియాజ్..గురువారమే వైసీపీలో చేరారు. చేరిన మరుసటి రోజే ఆయనను కర్నూలు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించింది వైసీపీ.

Tags:    
Advertisement

Similar News