వీళ్ళని సర్వేలే కలుపుతాయా?

విడివిడిగా పోటీ చేస్తే పరిస్థితి ఏమిటనేది చంద్రబాబు, పవన్‌కు బాగా తెలుసు. సరిగ్గా ఈ నేపథ్యంలోనే ఒక సర్వే రిపోర్టు తాజాగా వెలుగుచూసింది. ఇప్పటికప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే అనే ప్రాతిపదికన టైమ్స్ నౌ నవభారత్ దేశవ్యాప్తంగా సర్వే చేసింది.

Advertisement
Update:2023-07-02 10:17 IST

రాష్ట్రంలో రాజకీయం విచిత్రంగా ఉంది. ప్రతిపక్షాల మధ్య పొత్తుల విషయంలో ఒక్కోపార్టీ ఒక్కోవిధంగా స్పందిస్తోంది. అందుకనే ఎన్నికలు దగ్గరపడుతున్నా పొత్తులపై క్లారిటి రావటంలేదు. టీడీపీ, జనసేన పార్టీలు పొత్తులు పెట్టుకోనిదే ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. కాకపోతే వీళ్ళతో బీజేపీ కలుస్తుందా లేదా అన్నదే అయోమయంగా ఉంది. ఇదే సమయంలో టీడీపీతో పొత్తువద్దని కొందరు జనసేన నేతలు అధినేత పవన్ కల్యాణ్‌కు చెబుతున్నారు. ఇదే విధంగా జనసేనతో పొత్తు వద్దు ఒంటరిగానే పోటీ చేద్దామని తమ్ముళ్ళూ చంద్రబాబునాయుడును కోరుతున్నారు.

అయితే విడివిడిగా పోటీ చేస్తే పరిస్థితి ఏమిటనేది చంద్రబాబు, పవన్‌కు బాగా తెలుసు. సరిగ్గా ఈ నేపథ్యంలోనే ఒక సర్వే రిపోర్టు తాజాగా వెలుగుచూసింది. ఇప్పటికప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే అనే ప్రాతిపదికన టైమ్స్ నౌ నవభారత్ దేశవ్యాప్తంగా సర్వే చేసింది. ఇందులో భాగంగానే ఏపీలో కూడా సర్వే చేసింది. సర్వేలో ఏమితేలిందంటే వైసీపీకి 24 లేదా 25కి 25 సీట్లలో విజయం ఖాయమట. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి గెలుచుకున్న 151 అసెంబ్లీ, 22 పార్లమెంటు స్థానాల విజయాన్నే చంద్రబాబు, పవన్ తట్టుకోలేకపోతున్నారు.

రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఇంతకుమించి సీట్లొస్తాయి అంటే వీళ్ళిద్దరి సంగతి గోవిందానే. జగన్మోహన్ రెడ్డి లెక్కప్రకారం వైనాట్ 175 నినాదమే నిజమయ్యేట్లుంది సర్వే వివరాలు చూస్తే. ఆమధ్య టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే వివరాలు కూడా ఇలాగే ఉంది. తాజా సర్వే చూసిన తర్వాత కచ్చితంగా చంద్రబాబు, పవన్‌లో టెన్షన్ మొదలయ్యే ఉంటుంది. విడివిడిగా పోటీచేస్తే ఏమవుతుంది అనే భయానికి తాజా సర్వేనే సమాధానం చెప్పినట్లయ్యింది.

అందుకనే రెండో ఆలోచన లేకుండా కచ్చితంగా రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయనటంలో సందేహం లేదు. సర్వేల భయంతోనే పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యపోవక్కర్లేదు. అయితే తాజా సర్వేలో చెప్పినట్లుగా ఫలితాలు ఖాయమేనా అనే సందేహం కూడా పెరుగుతోంది. ఎందుకంటే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు దేనికదే విడివిడిగా పోటీ చేస్తాయి అన్నకోణంలో టైమ్స్ నౌ సర్వేచేసింది. టీడీపీ - జనసేన పొత్తుపెట్టుకుంటే ఫలితాలు మారిపోయే అవకాశాలున్నాయి. 

Tags:    
Advertisement

Similar News