ఏపీ అసెంబ్లీ ఈనెల 28కి వాయిదా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా పడింది.
ఏపీ శాసన సభ శుక్రవారానికి వాయిదా పడింది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే గవర్నర్ ప్రసంగం అనంతరం వాయిదా పడిన సభ.. మంగళవారం ఉదయం తిరిగి ప్రారంభమైంది. సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాణాన్ని ప్రవేశపెట్టగా.. బీజేపీ, జనసేన, టీడీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగం పై ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ సభ్యులు నిన్న సభలో వ్యవహరించిన తీరుపై కూటమి సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై సుదీర్ఘంగా మాట్లాడారు. అనంతరం సభను ఈనెల 28కి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించాడు. ఈనెల 26న మహాశివరాత్రి, 27న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. 28న అసెంబ్లీలో బడ్జెట్ ను కూటమి ప్రభుత్వం ప్రవేవపెట్టనుంది.