అటు బీఆర్ఎస్.. ఇటు టీడీపీ.. ఆ కల సాధ్యమేనా..?

గతంలో బీఆర్ఎస్ కూడా ఇదే అంచనా వేసుకుంది. టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత పొరుగు రాష్ట్రం ఏపీలో కూడా కొన్నిరోజులపాటు గులాబి జెండా రెపరెపలాడింది.

Advertisement
Update:2024-06-06 09:22 IST

ఏపీలో కూటమి విజయం తర్వాత తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబు ఫోకస్ పెట్టారని, అక్కడకూడా పార్టీని బలోపేతం చేసే దిశగా ఆలోచిస్తున్నారనే వార్తలు వినపడుతుననాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిని యువనేతకు అప్పగించి అక్కడ పార్టీకి జవసత్వాలు తేవాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు చెబుతున్నారు. ఈ వార్తలు టీటీడీపీ నేతలకు సంతోషం కలిగించొచ్చు కానీ.. తెలంగాణలో పూర్తిగా జీరో అయిన ఆ పార్టీ ఇప్పుడు కొత్తగా ఉనికి చాటుకుంటామంటే సాధ్యమయ్యే పనేనా..? అనేది తేలాల్సి ఉంది.

గతంలో బీఆర్ఎస్ కూడా ఇదే అంచనా వేసుకుంది. టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత పొరుగు రాష్ట్రం ఏపీలో కూడా కొన్నిరోజులపాటు గులాబి జెండా రెపరెపలాడింది. కొత్తగా రిక్రూట్ అయిన ఏపీ బీఆర్ఎస్ నేతలు హడావిడి చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే లోక్ సభ ఎన్నికల నాటికి మహారాష్ట్ర, ఏపీలో కూడా తన ప్రభావం చూపాలనుకున్నారు బీఆర్ఎస్ నేతలు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత ఆ ఉత్సాహం తగ్గిపోయింది. ఏపీలోనే కాదు, మహారాష్ట్రలో కూడా పార్టీ ఖాళీ అవుతోంది. ఆయా రాష్ట్రాల్లో కొత్తగా బీఆర్ఎస్ లో చేరిన నేతలంతా ఎక్కడివారక్కడ సర్దుకున్నారు. ఇప్పుడు ఇదే ఆలోచన చేస్తున్న టీడీపీకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.

తెలంగాణలో టీడీపీది మరీ తీసిపారేయాల్సిన పరిస్థితి కాదు. 2014, 2018లో తెలంగాణ ఎన్నికల్లో ఉనికి చాటుకున్న టీడీపీ 2023 నాటికి పూర్తిగా చేతులెత్తేసింది. పరోక్షంగా కాంగ్రెస్ కి సహకరించేందుకే చంద్రబాబు వ్యూహ రచన చేశారనే ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు ఏపీలో ఫుల్ మెజార్టీ వచ్చేసరికి చంద్రబాబు తెలంగాణపై దృష్టిసారించారని అంటున్నారు. బీఆర్ఎస్ స్థానాన్ని భర్తీ చేసేందుకు బాబు వస్తున్నారంటూ మరికొందరు మరింత ఎక్కువ అంచనా వేసి ప్రచారం చేస్తున్నారు. వీటిల్లో ఏది నిజమవుతుంది..? ఎంత నిజమవుతుందనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. 

Tags:    
Advertisement

Similar News