గోడమీద బొమ్మ: వైసీపీకి పోటీగా టీడీపీ, జనసేన స్టిక్కర్లు

ఓవైపు అధికార పార్టీ ఇలా వెళ్లి అలా స్టిక్కర్లు అంటించి వస్తుంటే.. అటు ప్రతిపక్ష నేతలు మరుసటి రోజు వెళ్లి వాటిపై తమ స్టిక్కర్లు వేసి వస్తున్నారు.

Advertisement
Update:2023-04-10 11:18 IST

ఏపీలో ప్రస్తుతం స్టిక్కర్ల రాజకీయం నడుస్తోంది. "మా నమ్మకం నువ్వే జగన్" అంటూ వైసీపీ జగన్ బొమ్మలు.. అంటించడం మొదలు పెట్టింది. దీనికి కౌంటర్ గా జనసేన "మాకు నమ్మకం లేదు జగన్, మాకు నమ్మకం పవన్" అంటూ కొత్త స్టిక్కర్లు వేయించింది. సరిగ్గా జగన్ స్టిక్కర్లపైనే వాటిని అంటిస్తూ జనసైనికులు వైసీపీ నేతల్ని రెచ్చగొట్టారు. ఇప్పుడు టీడీపీ కూడా రంగంలోకి దిగింది. "మీరే మా గౌరవం, మీతోనే రాష్ట్ర అభివృద్ధి" అంటూ చంద్రబాబు ఫొటోలతో స్టిక్కర్లు రెడీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వీటిని గోడలపై అంటించబోతున్నారు.

స్టిక్కర్ పాలిటిక్స్..

తాము అట్టహాసంగా ప్రారంభించిన ఈ కార్యక్రమానికి వెంటనే పేరడీలు రెడీ అయ్యే సరికి వైసీపీ నేతలు కంగారు పడుతున్నారు. ఓవైపు అధికార పార్టీ ఇలా వెళ్లి అలా స్టిక్కర్లు అంటించి వస్తుంటే.. అటు ప్రతిపక్ష నేతలు మరుసటి రోజు వెళ్లి వాటిపై తమ స్టిక్కర్లు వేసి వస్తున్నారు. దీంతో అసలు ఏ ఇంటికి ఏ స్టిక్కర్ పడిందో, ఎవరు వైసీపీకి అనుకూలమో, ఎవరు ఆ పార్టీకి వ్యతిరేకమో తెలియని పరిస్థితి ఏర్పడింది.

కౌంటర్ కాస్త గట్టిగానే..

ఫలనా ఇంటిపై మా స్టిక్కర్ వేశాం, దానిపై మీరు స్టిక్కర్ అతికించడానికి వీలు లేదు అని వైసీపీ నేతలు చెప్పలేరు. పోనీ సీఎం జగన్ స్టిక్కర్ని అవమానించారంటూ పోలీస్ కేసు కూడా పెట్టలేని పరిస్థితి. దీంతో సైలెంట్ గా చూస్తూ ఉండిపోతున్నారంతే. స్టిక్కర్లు అతికిండచంలో ఇంకా ఎక్కడా గొడవలు జరగలేదు. వైసీపీ బ్యాచ్ ఉదయాన్నే ఇంటింటికీ తిరిగి కష్టపడి వారి అనుమతి తీసుకుని స్టిక్కర్లు వేసి వెళ్తుంటే.. సాయంత్రమో లేదా ఆ తర్వాతి రోజో ఎవరి అనుమతి లేకుండానే జనసేన, టీడీపీ నేతలు వచ్చి పని పూర్తి చేసుకుని వెళ్తున్నారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. 

Tags:    
Advertisement

Similar News