ఏపీ ఫైబర్ నెట్ కొత్త ఎండీగా ప్రవీణ్ ఆదిత్య

ఏపీ ఫైబర్‌నెట్‌ నూతన ఎండీగా ప్రవీణ్‌ ఆదిత్య నియమితులయ్యారు.

Advertisement
Update:2025-02-25 18:15 IST

ఏపీ ఫైబర్‌నెట్ కొత్త ఎండీగా ప్రవీణ్‌ ఆదిత్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పాత ఎండీ దినేష్‌కుమార్‌ను అవినీతికి పాల్పడ్డారని జీవీ రెడ్డి ఫైబర్ నెట్ మాజీ ఛైర్మన్ ఆరోపించిన విషయం తెలిసిందే. సోమవారం ఫైబర్‌ నెట్‌ ఛైర్మన్‌ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఫైబర్‌ నెట్‌ ఎండీ దినేష్‌కుమార్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కొత్త ఎండీగా ప్రవీణ్‌ ఆదిత్యను నియమించింది. దినేష్‌కుమార్‌ను జీఏడీకి అటాచ్ చేసింది.


Tags:    
Advertisement

Similar News