విజయసాయిరెడ్డి రాజీనామాపై షర్మిల షాకింగ్ కామెంట్స్

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Update:2025-01-25 17:56 IST

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయిరెడ్డి జగన్‌కు అత్యంత సన్నిహితుడు. మాజీ సీఎం జగన్ ఏపని ఆదేశిస్తే ఆపని చేయడం సాయిరెడ్డి పని షర్మిల అన్నారు. అలాంటి వ్యక్తి రాజీనామా చేశారంటే చిన్న విషయం కాదని వైసీపీ కార్యకర్తలు, నేతలు ఆలోచించుకోండి అని షర్మిల అన్నారు. నా అనుకున్న వాళ్లను జగన్ కాపాడుకోలేక పోతున్నారని పేర్కొన్నారు.జగన్ఎ వరిని తిట్టమంటే వాళ్ళను తిట్టడం సాయి రెడ్డి పని. రాజకీయంగా కాదు.. వ్యక్తిగతంగా కూడా.. నా బిడ్డల విషయంలో అబద్ధాలు చెప్పిన వ్యక్తి సాయి రెడ్డి.

వైసిపి కార్యకర్తలు, వైఎస్ అభిమానులు ఆలోచన చేయండి. జగన్ ను విజయసాయి రెడ్డి వదిలేశారు అంటే ఎందుకు.. సన్నిహితులు ఒక్కొక్కరుగా ఎందుకు వెళ్తున్నారు.. ప్రాణం పెట్టిన వాళ్ళు ఎందుకు జగన్ ను వీడుతున్నారు అని తెలిపారు.ఇక జగన్ నాయకుడుగా విశ్వసనీయత కోల్పోయారు. నాయకుడుగా ప్రజలను, నమ్ముకున్న వాళ్ళను మోసం చేశారు. నా అనుకున్న వాళ్ళను కాపాడుకోలేక పోతున్నాడు. జగన్ బీజేపీ కి దత్త పుత్రుడు. తనను తాను కాపాడుకోవడానికి సాయి రెడ్డిని బీజేపీ కి పంపడు. ఇన్నాళ్లు సాయి రెడ్డి నీ పక్కన పెట్టుకొని బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు. జగన్ విశ్వసనీయత కోల్పోయాడు కాబట్టే సాయి రెడ్డి వెళ్ళిపోయాడని షర్మిల పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News