సాయిధరమ్ తేజ్ Vs వైసీపీ ఫ్యాన్స్.. ట్వీట్ వార్
మెడలు రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ సాయి ధరమ్ తేజ్, తణుకులో అన్న క్యాంటీన్లో ప్లేట్లు కడగొచ్చుగా సేఫ్ హ్యాండ్స్‌తో అంటూ ట్వీట్ చేశారు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్, వైసీపీ అభిమానుల మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. ట్విట్టర్లో ఓ వైసీపీ అభిమాని చేసిన ఓ ట్వీట్‌కు సాయి ధరమ్ తేజ్ స్పందించడంతో ఈ వివాదం ముదిరింది. దీంతో వైసీపీ అభిమానులు సాయిధరమ్ తేజ్‌ను టార్గెట్ చేశారు.
ఇంతకీ ఏం జరిగిందంటే!
డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి, NRI. వైసీపీ అభిమాని. ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉంటారు. రాష్ట్రంలో పరిస్థితులపై ఎప్పటికప్పుడూ తన అభిప్రాయాలను ట్విట్టర్లో పంచుకుంటారు. ఈ నేపథ్యంలోనే సోమవారం చింతా ప్రదీప్ రెడ్డి తణుకులో అన్న క్యాంటీన్లో మురికి నీటిలో ప్లేట్లు కడిగిన ఘటనపై స్పందించారు. మెడలు రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ సాయి ధరమ్ తేజ్, తణుకులో అన్న క్యాంటీన్లో ప్లేట్లు కడగొచ్చుగా సేఫ్ హ్యాండ్స్‌తో అంటూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌కు స్పందించిన సాయి ధరమ్ తేజ్.. అడిగిన ప్రశ్నకు పొంతన లేకుండా సమాధానం ఇచ్చారు. ఎగ్ పఫ్స్ బిల్లు ఎక్కువైంది, మీరు బాగా తిని ఉంటారు అంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ వేశారు. దీనికి స్పందించిన చింతా ప్రదీప్ రెడ్డి తనకు తాను ఎగ్‌పఫ్‌లు కొనుక్కుంటానని, మరొకరి సాయం అవసరం లేదంటూ సాయి ధరమ్ తేజ్‌కు కౌంటర్ ఇచ్చారు. అంతే కాదు ఉప్పెన సినిమాలో కిృతి శెట్టి మైనర్ అయినప్పటికీ ఆమెతో అడల్ట్ సీన్లలో యాక్ట్ చేశారని సాయి ధరమ్ తేజ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను ఏదైతో చెప్తానో ఆ విషయాన్ని ఆచరిస్తానంటూ సాయి ధరమ్ తేజ్‌కు చురకలు అంటించారు. తర్వాత సాయిధరమ్‌తేజ్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
ఇక వైసీపీ అభిమానులు సాయి ధరమ్ తేజ్‌ను టార్గెట్ చేశారు. అడిగిన విషయానికి సమాధానం చెప్పకుండా.. ఎగ్ పఫ్‌ల గురించి మాట్లాడడం ఏంటని సాయిపై మండిపడుతున్నారు. ఎగ్‌పఫ్‌ల ఖర్చు గురించి ఆధారాలు ఉంటే సమర్పించాలని సవాల్ విసురుతున్నారు. అంతేకాదు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన అత్యాచారాలపై ఎందుకు స్పందించలేదని సాయి ధరమ్ తేజ్‌ను నిలదీస్తున్నారు. ఎక్కడో హైదరాబాద్‌లో ఉండి ట్వీట్స్ వేయడం కాదని, రాష్ట్రంలో జరుగుతున్న వాటిపై స్పందించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.