ఈ నెల 20 నుంచి శ్రీవారి సర్వదర్శనం

20న టీటీడీ ప్రోటోకాల్‌ భక్తులకు మినహా మిగిలిన వారికి వీఐపీ బ్రేక్‌ దర్శనం రద్దు

Advertisement
Update:2025-01-17 10:22 IST

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఈ నెల 19న ముగియనున్న నేపథ్యంలో సర్వదర్శన ఏర్పాట్లపై అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులతో కలిసి టీటీడీ ఈవో జె. శ్యామలరావు గురువారం సమీక్షించారు. తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ శుక్రవారం ముగిసే అవకాశం ఉన్నదని ఈవో తెలిపారు. ఈ నెల 20న సర్వదర్శనం కోరే భక్తులకు 19న తిరుపతిలో సాధారణ ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ చేయరు. భక్తులు సర్వదర్శనం క్యూలైన్‌లో ప్రవేశించి నేరుగా శ్రీవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. 19న ఆఫ్‌లైన్‌లో శ్రీవారి దర్శన టికెట్లు జారీ చేయరు. 20న టీటీడీ ప్రోటోకాల్‌ భక్తులకు మినహా మిగిలిన వారికి వీఐపీ బ్రేక్‌ దర్శనం రద్దు చేశారు. ఈ కారణంగా 19న వీఐపీ బ్రేక్‌ దర్శనం కోసం ఎటువటి సిఫారసు లేఖలూ స్వీకరించరు అని ఈవో పేర్కొన్నారు. 

Tags:    
Advertisement

Similar News