ఐటీ ఉద్యోగుల నిరసన సరే.. మరి వారెక్కడ..? - టీడీపీకి ఆర్జీవీ ప్రశ్న
స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టయిన నాటి నుంచి తెలుగుదేశం నేతలు ఇదే వాదిస్తున్నారు. స్కాం జరిగితే 2 లక్షల మంది ఎలా లబ్ధి పొందారని ప్రశ్నిస్తున్నారు. అయితే తాజాగా ఇదే అంశంపై ఆర్జీవీ టీడీపీ నేతలకు ఎదురు ప్రశ్న వేశారు
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కాంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టయిన నాటి నుంచి.. వీలు కుదిరినప్పుడల్లా ఆయనపై పొలిటికల్ సెటైర్స్ వేస్తున్నారు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. ఈ అంశంలో వైసీపీకి మద్దతుగా నిలుస్తూ.. తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో టీడీపీ నేతలు చేస్తున్న హడావుడిపై కౌంటర్లు వేస్తున్నారు. తనదైన శైలిలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంపై వారికి ప్రశ్నలు సంధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
తాజాగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ మరో ట్వీట్ చేశారు ఆర్జీవీ. వందో, రెండు వందల మందో హైదరాబాద్ ఐటీ ఎంప్లాయీస్ జైలు దగ్గర నిరసన చేపట్టారు సరే.. కానీ స్కిల్ స్కీం ద్వారా డైరెక్ట్‌గా లబ్ధి పొందారని టీడీపీ నేతలు చెప్తున్న 2 లక్షల మంది ఎక్కడికి పోయారో చెప్పాలంటూ ట్వీట్ చేశారు రామ్‌గోపాల్ వర్మ.
స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టయిన నాటి నుంచి తెలుగుదేశం నేతలు ఇదే వాదిస్తున్నారు. స్కాం జరిగితే 2 లక్షల మంది ఎలా లబ్ధి పొందారని ప్రశ్నిస్తున్నారు. అయితే తాజాగా ఇదే అంశంపై ఆర్జీవీ టీడీపీ నేతలకు ఎదురు ప్రశ్న వేశారు. చంద్రబాబు తీసుకువచ్చిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందిన 2 లక్షల మంది ఈ పాటికి రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేయాలి కదా అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం జరిగిన విధానంపైనా గతంలో పలు ట్వీట్లు చేశారు ఆర్జీవీ.