ఎక్కడ ఎన్నికలు జరిగినా కాషాయజెండా రెపరెపలు

కార్యకర్తల కృషి వల్లనే ఈ విజయం సాధ్యమైందన్న పురందరేశ్వరి

Advertisement
Update:2025-02-09 13:16 IST

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంపై ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందరేశ్వరి స్పందించారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కాషాయజెండా రెపరెపలాడుతున్నదని సంతోషం వ్యక్తం చేశారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ అధికారంలోకి వచ్చాం. కార్యకర్తల కృషి వల్లనే ఈ విజయం సాధ్యమైంది. ఏపీలో గత ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిని నిర్లక్ష్యం చేసింది. అప్పుడు అభివృద్ధి అనే పదానికి తావులేకుండా పోయింది. దోచుకోవడంపైనే వైసీపీ నేతలు దృష్టి పెట్టారని పురందరేశ్వరి విమర్శించారు. 



తెలంగాణ నేతల సంబరాలు

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన తెలంగాణ నేతలు సంబరాలు చేసుకున్నారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు చేరుకుని బాణసంచా కాల్చారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్‌, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, పార్టీ నేతలు చింతల రామచంద్రారెడ్డి తదితరులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. కార్యకర్కతలు, నేతలు పరస్పరం స్వీట్లు పంచుకున్నారు.

Tags:    
Advertisement

Similar News