అసెంబ్లీలో నారాయణస్వామి వ్యాఖ్యలతో రచ్చ

ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్శిటీకి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టాలన్న ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో టీడీపీ సభ్యులు గొడవకు దిగారు.

Advertisement
Update:2022-09-21 10:27 IST

ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్శిటీకి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టాలన్న ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో టీడీపీ సభ్యులు గొడవకు దిగారు.స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు తీశారు. బిల్లు కాగితాలను చించి స్పీకర్ మీదకు విసిరారు. ఎన్టీఆర్‌ పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇంతలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి టీడీపీ సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్‌ పేరును కొనసాగించాలని కోరుతున్న టీడీపీ.. తాను అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్య శ్రీకి వైఎస్‌ఆర్‌ పేరును ఎందుకు తొలగించి ఎన్టీఆర్‌ పేరు పెట్టారో చెప్పాలన్నారు. ఎన్టీఆర్‌పై తమకు గౌరవం ఉంది కాబట్టే కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టామన్నారు. టీడీపీ సభ్యులను ఉద్దేశించి అసలు మీలో చంద్రబాబును తిట్టని వ్యక్తి ఎవరంటూ నారాయణస్వామి ప్రశ్నించారు. దొంగ ఓట్ల సాయంతో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు.

టీడీపీలోని ఒక ఎమ్మెల్యేను ఉద్దేశించి.. ''నీవు కూడా మొన్న చంద్రబాబును తిట్టావ్. తిరిగి పదవి ఇస్తామని చంద్రబాబు కాళ్లు పట్టుకుంటే ఆగిపోయావ్'' అంటూ నారాయణ స్వామి వ్యాఖ్యానించారు. టీడీపీ సభ్యుల తీరుతో ఆగ్రహించిన స్పీకర్ ఒక దశలో చైర్ మీద నుంచి పైకి లేచి టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.

Tags:    
Advertisement

Similar News