ఏపీ కేబినెట్‌లో పలు నిర్ణయాలు

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది

Advertisement
Update:2024-12-03 16:14 IST

ఏపీ మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం అయింది. ఈ కేబినెట్ సమావేశంలో 10 అంశాలపై కీలకంగా చర్చించారు. గత ఐదేళ్లలో నిర్మాణం మొదలు పెట్టని గృహాలను రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు ఓకే చెప్పింది. సమీకృత పర్యాటక, స్పోర్ట్స్ పాలసీ 2024-29, ఆయుర్వేద, హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 15న ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహిస్తామని ప్రకటించింది. ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0కి ఆమోదం తెలిపింది. ఏపీ టెక్స్ టైల్స్ గార్మెంట్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఏపీ మారిటైమ్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.

పులివెందుల, ఉద్దానం, డోన్‌లో తాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. డిసెంబర్12న ప్రభుత్వం ఏర్పడి 6నెలలు పూర్తవుతుంది కాబట్టి..., ఎవరేం చేశారో సమగ్ర నివేదిక ఇస్తే స్ట్రీమ్ లైన్ చేస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. లిక్కర్, ఇసుక మాఫియాలను అరికట్టాం, చిన్న చిన్న సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని మాటిచ్చారు. రేషన్ మాఫియాను అరికడుతున్నాం, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ద్వారా రెవెన్యూ సమస్యలూ పరిష్కరిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. డిసెంబర్ 15వ తేదీన పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం జరపాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఐటీ, టెక్స్‌టైల్, మారీటైమ్ పాలసీలకు మంత్రివర్గం ఆమోదం తెలపింది. పర్యాటక, స్పోర్ట్స్ పాలసీల్లో పలు సవరణలకు కూడా మంత్రివర్గం ఆమోదించింది.

Tags:    
Advertisement

Similar News