ఇప్పుడు రంగంలోకి ఎల్‌వీ ప్ర‌సాద్ ఆస్ప‌త్రి

చంద్రబాబు ఎడమ కంటికి జూన్‌లో క్యాటరాక్ట్ ఆపరేషన్ జరిగిందని, కాబట్టి మూడు నెలల్లో కుడి కంటికి కూడా క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాలని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి నుండి లెటర్ తెచ్చుకున్నారు.

Advertisement
Update:2023-10-27 11:46 IST

స్కిల్ స్కామ్‌లో అరెస్టయి రిమాండులో ఉన్న చంద్రబాబునాయుడు బెయిల్ కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతమంది లాయర్లను దింపినా, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చుచేసినా ఏ కోర్టులోను బెయిల్ దొరకటంలేదు. మధ్యంతర బెయిలు కోసం ప్రయత్నించారు. చివరకు ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటీషన్లను కూడా కోర్టులు కొట్టేశాయి. దాంతో సెంటిమెంటుగా ముందు వయసు అన్నారు.. తర్వాత అనారోగ్యాలని చెప్పినా పప్పులుడకలేదు.

దాంతో చివరాఖరుగా ఇప్పుడు కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాలని గోల మొదలుపెట్టారు. చంద్రబాబు ఎడమ కంటికి మొన్న జూన్‌లో క్యాటరాక్ట్ ఆపరేషన్ జరిగిందని, కాబట్టి మూడు నెలల్లో కుడి కంటికి కూడా క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాలని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి నుండి లెటర్ తెచ్చుకున్నారు. చంద్రబాబు కంటి ఆరోగ్యం విషయంలో ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు ఎందుకింత శ్రద్ధ చూపిస్తున్నట్లు?

ఎందుకంటే ఈ ఆసుపత్రి కూడా చంద్రబాబుకు సంబంధించిన వాళ్ళదే కాబట్టి. నిజానికి ఏ ఆసుపత్రిలో అయినా ఆపరేషన్ చేయించుకోవటం పేషంట్ ఇష్టం. పేషంట్ ఏదన్నా సమస్యతో వస్తే డాక్టర్లు వైద్యం చేస్తారంతే. అంతేకానీ పలానా అప్పుడు ఆపరేషన్ చేయించుకున్నారు.. మళ్ళీ పలానా సమయంలో ఆపరేషన్ చేయించుకోవాలని రిమైండర్లు ఇవ్వరు. పేషంట్ వస్తే ఆపరేషన్ చేస్తారు లేకపోతే లేదంతే. కానీ ఇక్కడ ఎల్వీ ప్రసాద్ ఆసుప్రతి వైద్యులు మాత్రం అక్టోబర్ 21వ తేదీన అర్జంటుగా చంద్రబాబు కంటి పరిస్థితి మీద ఒక లెటర్ జారీ చేయటమే ఆశ్చర్యంగా ఉంది.

ఎడమ కంటికి జూన్ 21న క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. డాక్టర్ల లెక్క ప్రకారమే మూడు నెలలు అంటే ఆగస్టు 21న‌ కుడి కన్ను కూడా ఆపరేషన్ చేయించుకోవాలి. అయితే చంద్రబాబు ఆపరేషన్ చేయించుకోకుండా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్రమంతా తిరుగుతునే ఉన్నారు.సెప్టెంబర్ 9న అరెస్టవ్వగానే క్వాష్ పిటీషన్ వేశారు. ఏ కోర్టులోనూ ఉపశమనం లభించలేదు. చివరకు సుప్రీంకోర్టులో కూడా క్వాష్ పిటీషన్ డిస్మిస్ చేసేస్తారనే ప్రచారం జరుగుతోంది. దాంతో బెయిల్ ఇప్పట్లో దొరకదని అర్థ‌మైపోవటంతో సడెన్‌గా కంటి ఆపరేషన్ గోల మొదలుపెట్టారు. మరి కోర్టు ఏమంటుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News