హామీల డైవర్షన్ కోసమే లడ్డు ఇష్యూ తెరపైకి : జగన్

సీఎం చంద్రబాబు 100 రోజుల పాలన పూర్తిగా విఫలమైందని డైవర్ట్ కోసమే లడ్డు వ్యవహరం తెరపైకి తీసుకొచ్చారని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు . ఇవాళ ఆయన తిరుమల పర్యటనను రద్దు చేసుకొని తాజాగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

Advertisement
Update:2024-09-27 16:40 IST

ఆంధ్రపదేశ్‌లో రాక్షస పాలన సాగుతుందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ తిరుమల పర్యటనను రద్దు చేసుకొని ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజకీయ దుర్బుద్దితో జంతువుల కొవ్వుతో శ్రీవారి ప్రసాదం తయారైనట్టుగా.. జరగని విషయాన్ని జరిగినట్టుగా.. నాణ్యత లేని లడ్లూను భక్తులు తిన్నట్టుగా నిజంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అబద్దాలు ఆడుతూ.. అసత్యాలు చెబుతున్నారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు 100 రోజుల పాలన విఫలమైందని డైవర్ట్ కోసమే తిరుమల లడ్డు వ్యవహరం తెరపైకి తీసుకొచ్చారని అధినేత జగన్ అన్నారు. తిరుమలలో వేలాది మంది పోలీసులు మోహరించారు. అడ్డగోలుగా చంద్రబాబు శ్రీవారి ఆలయ పవిత్రను దెబ్బ తీస్తున్నారు. 6నెలలకొకసారి టెండర్లు జరుగుతాయి. టీటీడీ బోర్డు టెండర్లు అప్రూవుల్ చేస్తోంది.

టీటీడీ బోర్డు ప్రసిద్ధిగాంచినది. దేశం మొత్తం నుంచి సభ్యత్వం ఉంటుంది. బోర్డు సభ్యత్వం కోసం కేంద్ర మంత్రులు, చుట్టూ ప్రక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రులు రికమండ్ చేస్తారు. క్వాలిటీ ఏదైనా అనుమానం వస్తే వాటిని రిజెక్ట్ చేస్తారు. గతంలో చంద్రబాబు హయాంలో 15సార్లు రిజెక్ట్ చేశారు.దివగంత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా రిజెక్ట్ చేశారని గుర్తు చేశారు. ఆరు నెలకొకసారి నెయ్యి కొనుగోలు టెండర్లు జరుగుతాయి. ఎల్‌1 ఎవరొచ్చారో వారికే టెండర్లు ఇస్తారు. దశాబ్ధాలుగా ఈ ప్రక్రియనే జరుగుతూ ఉంది. ప్రతి ట్యాంకర్‌ ఎన్‌ఏబీఎల్‌ సర్టిఫికెట్‌ తేవాలి. ట్యాంకర్‌ వచ్చాక కూడా టీటీడీ 3 టెస్టులు చేస్తుంది. ఒక్క టెస్ట్‌ ఫెయిల్‌ అయినా ట్యాంకర్‌ను వెనక్కి పంపుతారు. కానీ మొదటిసారిగా ఈ శాంపిల్స్‌ను గుజరాత్‌కు పంపారు. ట్యాంకర్లను వెనక్కి పంపి సదరు కంపెనీకి నోటీసులు ఇచ్చారు. 2 నెలల తర్వాత చంద్రబాబు యానిమల్‌ ఫ్యాట్‌ కలిసిందన్నారు. ఆ మరుసటి రోజే టీడీపీ ఆఫీస్‌లో ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ను బయటపెట్టారు.’’ అని జగన్‌ తెలిపారు.

Tags:    
Advertisement

Similar News