సినిమా టైపులోనే ‘వారాహి’ సెన్సేషనా?

ఇప్పుడు సమస్య ఏమిటంటే జనసేన నేతలు అవుట్ లైన్ ఇచ్చి యాత్రకు అనుమతి తీసుకున్నారు. పోలీసులేమో మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ అడుగుతున్నారు. ఇది ఇవ్వటానికి జనసేన నేతలు ఒప్పుకోవటంలేదు. అవసరమైతే కోర్టుకెళ్ళి అనుమతి తెచ్చుకుంటామంటున్నారు. పోలీసులు పవన్ యాత్రకు అనుమతి నిరాకరిస్తేనే కదా కోర్టుకు వెళ్ళాల్సింది.

Advertisement
Update:2023-06-13 10:10 IST

సినిమా టైపులోనే ‘వారాహి’ సెన్సేషనా?

ఏదన్నా కొత్త సినిమాను రిలీజ్ చేసేముందు కొందరు దర్శక, నిర్మాతలు సెన్సేషన్ క్రియేట్ చేయాలని అనుకుంటారు. అందుకోసం కావాలనే బోల్డు సీన్లు, వివాదాస్పద సీన్లను ట్రైలర్లుగా రిలీజ్ చేశారు. దాంతో సినిమా విడుదల కాకూడదని, లేకపోతే సదరు సీన్లను తొలగించాలని జనాలు గోల మొదలుపెడతారు. దిష్టిబొమ్మలను తగలబెడతారు, పోస్టర్లను చించేస్తారు, టీవీ డిబేట్లలో రచ్చరచ్చ చేస్తారు. దాంతో సినిమాకు విపరీతమైన ప్రచారం వచ్చేస్తుంది. రిలీజ్ కాగానే జనాలు ఎగబడతారు. తీరాచూస్తే అసలు సినిమాలో ఏమీ ఉండదు.

ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు కూడా ఇలాంటి జిమ్మిక్కే ప్లాన్ చేసినట్లున్నారు. అందుకనే యాత్రకు ముందే గొడవలు మొదలయ్యేట్లుగా వ్యూహం పన్నినట్లున్నారు. మొదటి విడతలో ఉభయ గోదావరి జిల్లాల్లోని 11 నియోజకవర్గాల్లో టూర్ ఉంటుందని ముందుగానే ప్రకటించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడిలో బహిరంగసభ ఉంటుందని కూడా జనసేన ప్రకటించింది. ఈ ప్రకటన మీడియాకు, జనాలకు తెలిసేందుకు చేసేది.

అయితే ఇలాంటి వివరాలే పోలీసులకు ఇస్తే సరిపోదు. యాత్ర చేయాలని అనుకుంటే ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చి అనుమతి తీసుకోవాలి. సమాచారం ఇవ్వటమంటే మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్‌ను అందివ్వాలి. ఎందుకంటే వారాహి యాత్ర సజావుగా సాగేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలి కాబట్టి. యాత్ర సాగే రూటు మొత్తం పోలీసులుండాలంటే ఎక్కడెక్కడి వాళ్ళని తీసుకొచ్చి బందోబస్తు డ్యూటీ వేయాలి. సడెన్‌గా యాత్ర రూటు మారిందంటే పోలీసులు అంగీకరించరు.

ఇప్పుడు సమస్య ఏమిటంటే జనసేన నేతలు అవుట్ లైన్ ఇచ్చి యాత్రకు అనుమతి తీసుకున్నారు. పోలీసులేమో మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ అడుగుతున్నారు. ఇది ఇవ్వటానికి జనసేన నేతలు ఒప్పుకోవటంలేదు. అవసరమైతే కోర్టుకెళ్ళి అనుమతి తెచ్చుకుంటామంటున్నారు. పోలీసులు పవన్ యాత్రకు అనుమతి నిరాకరిస్తేనే కదా కోర్టుకు వెళ్ళాల్సింది. పోలీసులు అడుగుతున్నది డీటైల్డ్ ప్రోగ్రామ్ షీట్ మాత్రమే. మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఇవ్వటానికి జనసేన నేతలకు అభ్యంతరాలు ఏమిటో? ఇదంతా చూస్తుంటే ఫక్తు సినిమా రిలీజ్‌కు ముందు హైప్ క్రియేట్ చేయటానికి చేసే ప్రయత్నంలాగే అనిపిస్తోంది.

Tags:    
Advertisement

Similar News