ఏపీలో చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్ వినిపించిన జగన్ సర్కార్
3.95 లక్షల మంది చిరు వవ్యాపారులకు ఎలాంటి వడ్డీలు లేకుండా ఒక్కొక్కరికి 10 వేల రూపాయలను ఇవ్వనున్నారు. ఆ సొమ్ముకు వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో చిరు వ్యాపారాలు చేసుకునే వారికి జగన్ సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది. వడ్డీ వ్యాపారుల చేతుల్లో చిక్కి అధిక వడ్డీలతో సతమతమవుతున్న చిరు వ్యాపారులకు అండగా ఉండేందుకు జగన్ సర్కార్ ప్రారంభించిన 'జగనన్న తోడు' పథకంలో భాగంగా రేపు 395 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలను అందించనున్నారు.
3.95 లక్షల మంది చిరు వవ్యాపారులకు ఎలాంటి వడ్డీలు లేకుండా ఒక్కొక్కరికి 10 వేల రూపాయలను ఇవ్వనున్నారు. ఆ సొమ్ముకు వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది.
ఒక్కొక్కరికీ రూ.10వేలు చొప్పున 3.95 లక్షల మంది చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారికి బ్యాంకుల ద్వారా కొత్తగా రూ.395 కోట్లు కొత్త రుణాలు అందించనున్నారు.
రేపు జగన్ చేతుల మీదుగా లబ్ధిదారులకు ఈ సొమ్ము అందనుంది. ఆ సొమ్ముమొత్తం డైరెక్ట్ గా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్తుంది. గత 6 నెలలకు సంబంధించిన రూ.15.17 కోట్ల వడ్డీ రీయంబర్స్‌మెంట్‌ను క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్ నొక్కడం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైయస్.జగన్
గ్రామాలు, పట్టణాల్లో సుమారు 5 అడగులు పొడవు, 5 అడుగులు వెడల్పు స్ధలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారు ఈ పథకానికి అర్హులు. అలాగే పుట్‌పాత్‌ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు అమ్మకుని జీవించేవారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు కూడా ఇందుకు అర్హులు.
గంపలు, బుట్టలలో వస్తువులు అమ్మేవారు, సైకిల్, మోటారు సైకిల్, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసేవారితో పాటు, ఫుట్ పాత్ పై షాపులు పెట్టుకునే వారు.. సంప్రదాయ చేతివృత్తుల కళాకారులు.. ఇత్తడి పని చేసేవాళ్లు, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీ, లేస్ వర్క్స్, కలంకారీ, తోలుబొమ్మలు, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారు ఈ పథకానికి అర్హులని అధికారులు తెలిపారు.