ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చేయాలి

వర్షాలపై ప్రజల మొబైల్‌ ఫోన్లకు మెసేజ్‌లు పంపి అలర్ట్‌ చేయాలన్న ఏపీ సీఎం చంద్రబాబు

Advertisement
Update:2024-10-14 12:46 IST

అల్పపీడన ప్రభావంతో ఏపీలో పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాలో తెల్లవారుజాము నుంచే వానలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అధికారులు, ప్రభుత్వ విభాగాల సన్నద్ధతపై సమీక్షించారు. ఏపీలో నాలుగు రోజులు వర్షాలుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. వర్షాలపై ప్రజల మొబైల్‌ ఫోన్లకు మెసేజ్‌లు పంపి అలర్ట్‌ చేయాలన్నారు. వాగులు, కాలువల వద్ద అపరమైన హెచ్చరిక బోర్డులు పెట్టాలని అధికారులను ఆదేశించారు. కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి ప్రజల వినతులపై వేగంగా స్పందించాలి. అప్రమత్తతో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.ప్రకాశం, నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్‌, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు సీఎంకు తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచామని చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News