ఎంపీకి అనుకూలంగా సీబీఐ వ్యవహరిస్తోందా..?

ఎంపీ అరెస్టుకు న్యాయపరమైన చిక్కులు తొలగిపోయి నెలదాటినా ఇంకా సీబీఐ అరెస్టు చేయలేదంటే డబుల్ గేమ్ ఆడుతోందా అన్న అనుమానం వచ్చేట్లుగా కథనం రాసుకొచ్చింది.

Advertisement
Update:2023-05-24 11:20 IST

కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుకు సంబంధించి ఎల్లోమీడియాలో వచ్చిన వార్తను చదివితే అందరికీ ఇదే అనుమానం వస్తుంది. ‘అవినాష్ రెడ్డి అరెస్టుకు ఎందుకీ మీనమేషాలు’ అనే హెడ్డింగ్ తో పెద్ద స్టోరీ రాసింది. అందులో అవినాష్ ను ఇంకా ఎందుకు అరెస్టుచేయలేదు..? ఎంపీని ఎప్పుడో ఫిబ్రవరిలోనే అరెస్టు చేయాలని నిర్ణయించుకున్నట్లు స్వయంగా కోర్టులోనే చెప్పిన సీబీఐ ఇంకా ఎందుకు తాత్సారం చేస్తోందని తెగ బాధపడిపోయింది.

ఎంపీ అరెస్టుకు న్యాయపరమైన చిక్కులు తొలగిపోయి నెలదాటినా ఇంకా సీబీఐ అరెస్టు చేయలేదంటే డబుల్ గేమ్ ఆడుతోందా అన్న అనుమానం వచ్చేట్లుగా కథనం రాసుకొచ్చింది. ఇక్కడ సమస్య ఏమిటంటే.. విచారణ, అరెస్టన్నది ఎంపీ-సీబీఐ మధ్య వ్యవహారం. విచారణచేసి పంపేయాలా..? లేకపోతే అరెస్టు చేయాలా..? అన్నది సీబీఐ డెసిషన్. మధ్యలో ఎల్లోమీడియాకు వచ్చిన ఇబ్బంది ఏమిటో అర్థంకావటంలేదు. సీబీఐతో ఎలాగైనా అవినాష్ రెడ్డిని అరెస్టు చేయించాలని ఎల్లోమీడియా మహా పట్టుదలగా ఉంది.

అరెస్టు చేయించాలనే కసి పెరిగిపోతున్న కారణంగానే ఆలస్యమవటాన్ని తట్టుకోలేకపోతోంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ మోసంలో ఛైర్మన్ రామోజీరావును ఏ-1 నిందితుడిగా సీఐడీ కేసునమోదు చేసి విచారించిన విషయం తెలిసిందే. దాన్ని అవమానంగా భావించిన ఎల్లోమీడియా ఇప్పుడు అవినాష్ ను అరెస్టు చేయించాలని పట్టుదలగా ఉంది. అందుకనే ఎక్కడలేని ఓవర్ యాక్షన్ చేస్తోంది. అవినాష్ ను అరెస్టు చేయాలని ఫిబ్రవరిలోనే నిర్ణయించినట్లు సీబీఐ కోర్టులో చెప్పినా ఇంకా ఎందుకు అరెస్టు చేయటంలేదని పదేపదే ప్రశ్నిస్తోంది.

ఇక్కడ ఎల్లోమీడియా జనాలను తప్పుదోవపట్టిస్తున్నది ఏమిటంటే.. ఎంపీని అరెస్టు చేస్తామని సీబీఐ కోర్టులో చెప్పలేదు. అవసరమైతే అరెస్టు చేస్తామని మాత్రమే చెప్పింది. అవసరం రాలేదు కాబట్టే అరెస్టు చేయలేదేమో. సీబీఐ కర్నూలుకు చేరుకున్నది ఎంపీని అరెస్టు చేయటానికే అని ఎల్లోమీడియా చెప్పేస్తోంది. అయితే ఎంపీని అరెస్టు చేసేందుకే తాము కర్నూలుకు వచ్చినట్లు సీబీఐ ఎక్కడా ప్రకటించలేదు. ఎల్లోమీడియానే ఏదేదో ఊహించేసుకుని తాను ఊహించినట్లుగా జరగకపోవటంతో తట్టుకోలేకపోతోంది. బెయిల్ పిటీషన్ విషయంలో కోర్టులు చుట్టూ ఎంపీ తిరుగుతుంటే సీబీఐ ఎందుకు చూస్తూ ఊరుకుంటోంది అని నిలదీస్తోంది. ఈ నేపథ్యంలోనే సీబీఐ భయపడుతోందా..? ఎంపీతో కలిసిపోయిందా..? తాత్సారం ఎందుకు చేస్తోందంటూ గోలగోల చేస్తోంది.

Tags:    
Advertisement

Similar News