ఐఏఎస్ శ్రీ‌ల‌క్ష్మీకి హైకోర్టు క్లీన్‌చిట్‌

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కేసులో ఆరో నిందితురాలిగా ఉన్న ఆమె 2011లో అరెస్ట్ అయ్యింది. దీంతో ప్రభుత్వం ఆమెను సస్పెండ్‌ చేసింది.

Advertisement
Update:2022-11-08 12:25 IST

సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి భారీ ఊరట ల‌భించింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో నిర్దోషిగా పరిగణిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. సుదీర్ఘ కాలంగా కొన‌సాగుతున్న ఈ కేసును మంగ‌ళ‌వారం నాడు హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆమె ఏపీ చీఫ్ సెక్రటరీ గా నియమితులు అయ్యేందుకు అడ్డంకులు సైతం తొల‌గిపోయాయి. శ్రీలక్ష్మి 1988 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ఆమె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ ప్ర‌త్యేక‌ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కేసులో ఆరో నిందితురాలిగా ఉన్న ఆమె 2011లో అరెస్ట్ అయ్యింది. దీంతో ప్రభుత్వం ఆమెను సస్పెండ్‌ చేసింది. చంచల్‌గూడ మహిళా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమె 2013 ఏప్రిల్ 2న షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ద్వారా విడుదలైంది. ఆమె జైలు నుంచి బెయిల్‌పై విడుదలయిన తర్వాత ప్రభుత్వం సస్పెన్షన్‌ను ఎత్తి వేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఆమె పోస్టల్ అడ్రస్‌ తెలంగాణలో ఉండడంతో కేంద్ర ప్ర‌భుత్వం శ్రీ‌ల‌క్ష్మిని తెలంగాణకు కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆమెను ప్రభుత్వరంగ సంస్థల శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించింది. 2014లో ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చాక శ్రీ‌ల‌క్ష్మి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లేందుకు ప్రయత్నించింది. కేంద్ర ప్రభుత్వం ఆమెను ఆంధ్రప్రదేశ్ కు పంపేందుకు నిరాకరించింది. ఆ నిర్ణయంపై శ్రీలక్ష్మి కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ను ఆశ్రయించింది. ఆమె తన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, దానికి సంబందించిన ఆధారాలను అందజేసింది. క్యాట్ ను ఆశ్రయించిన ఆమె విజయం సాధించింది. క్యాట్ అదేశాలతో కేంద్రప్రభుత్వం ఆమెను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం శ్రీలక్ష్మిని రిలీవ్ చేయడం, ఆమె అమరావతిలోని సచివాలయంలో జీఏడీ రిపోర్టు చేయడం కూడా జరిగిపోయాయి.

Advertisement

Similar News