హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌

స్వర్ణాంధ్ర - 2047 విజన్‌ డాక్యుమెంట్‌ పై చర్చలో సీఎం చంద్రబాబు

Advertisement
Update:2024-11-22 14:24 IST

హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌ తమ నినాదమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీలో స్వర్ణాంధ్ర - 2047 విజన్‌ డాక్యుమెంట్‌ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని, సుపరిపాలనను బ్యాలెన్స్‌ చేస్తూ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత తమపై ఉందన్నారు. భద్రత లేకుంటే పెట్టుబడులు పెట్టేందుకు ఏ ఒక్కరూ ముందుకు రారు అని చెప్పారు. వైసీపీ పాలనలో అక్రమాలపై లోతుల్లోకి వెళ్లేకొద్దీ ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాయని అన్నారు. వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయని.. అధికారయంత్రాంగం పూర్తిగా నిర్వీర్యం అయ్యిందన్నారు. ఇలాంటి పరిస్థితిని తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. 1995లో తాను సీఎం అయినప్పుడు ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని, అందుకే విధిలేని పరిస్థితుల్లో రూ.2లకే కిలో ఇచ్చే బియ్యం ధర పెంచాల్సి వచ్చిందన్నారు. 1999లో విజన్‌ 2020 తీసుకువచ్చామని.. దాని కారణంగా హైదరాబాద్‌ నాలెడ్జ్‌ ఎకానమీకి కేరాఫ్‌గా మారిందన్నారు. మోదీ వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా ముందుకెళ్తున్నారని.. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా మనం ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు అప్పటి వరకు తమ నియోజకవర్గాలు ఎలా ఉండాలో ఈ విజన్‌ డాక్యుమెంట్‌ లో పొందు పరచాలని సూచించారు.

Tags:    
Advertisement

Similar News