ఉత్తరాంధ్ర వాణి వినిపిస్తా.. నన్ను గెలిపించండి

మ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి 640కి పైగా ఓట్లు ఉన్నాయని, టీడీపీ కూటమికి 200 ఓట్లు కూడా లేవని, కానీ వాళ్లు దురుద్దేశపూర్వకంగా పోటీకి దిగుతున్నారని ఇది అన్యాయం అని అన్నారు బొత్స.

Advertisement
Update:2024-08-06 07:11 IST

శాసనమండలిలో ఉత్తరాంధ్ర వాణి వినపడాలంటే తనను గెలిపించాలని చెప్పారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్న ఆయన ఉత్తరాంధ్ర తరపున శాసన మండలిలో పోరాడే నేతలు కావాలన్నారు. తనను గెలిపిస్తే ఉత్తరాంధ్ర సమస్యలు పరిష్కరిస్తానని, వెనుకబడిన ప్రాంతం తరపున పోరాడతానని చెప్పుకొచ్చారు బొత్స.

పోటీ ఎలా చేస్తారు..?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి 640కి పైగా ఓట్లు ఉన్నాయని, టీడీపీ కూటమికి 200 ఓట్లు కూడా లేవని, కానీ వాళ్లు దురుద్దేశపూర్వకంగా పోటీకి దిగుతున్నారని ఇది అన్యాయం అని అన్నారు బొత్స. చంద్రబాబు కుట్రలు చేసినా ఈ ఎన్నికల్లో వైసీపీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలెవరూ ప్రలోభాలకు లొంగరని, తనకే ఓటు వేస్తారని అన్నారు బొత్స.

సార్వత్రిక ఎన్నికల్లో గెలవడం కోసం ఇష్టం వచ్చినట్టు హామీ­లిచ్చిన చంద్రబాబు ఇప్పు­డు రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పడం విడ్డూరం అని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి బొత్స. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తికి రాష్ట్ర బడ్జెట్‌ గురించి తెలియదా? అని ప్రశ్నించారు. ఎన్నికల హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేర్చాల్సిందేనని డిమాండ్ చేశారు. తమ నాయకుడు జగన్‌ ప్రజలకు సుపరిపాలన అందించారని గుర్తు చేశారు జగన్. 

Tags:    
Advertisement

Similar News