లడ్డూ ప్రసాదాలపై ఎలాంటి అనుమానాలు వద్దు: టీటీడీ

పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చేశామని తెలిపారు. ఇక లడ్డూ ప్రసాదాలపై ఎలాంటి అనుమానాలు వద్దని టీటీడీ అధికారుల వెల్లడి.

Advertisement
Update:2024-09-23 11:45 IST

శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా శాంతిహోం చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఆలయంలోని అన్ని విభాగాల్లో సంప్రోక్షణ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. స్వామివారికి మహా నైవేద్యం పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రసాదాల తయారీ కేంద్రాల్లో సంప్రోక్షణ చేస్తున్నామన్నారు. ప్రసాదం కల్తీ జరిగిందని భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చేశామని తెలిపారు. ఇక లడ్డూ ప్రసాదాలపై ఎలాంటి అనుమానాలు వద్దని అధికారులు చెప్పారు.

మరోవైపు లడ్డూ కోసం స్వచ్ఛమైన నెయ్యి కొనుగోలు చేస్తున్నామని టీటీడీ స్పష్టం చేసింది. నెయ్యి స్వచ్ఛతను పరీక్షించడానికి 18 మందితో ల్యాబ్‌ ప్యానెల్‌ను ఏర్పాటు చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఆగస్టులో నిర్వహించిన పవిత్రోత్సవాలతో లడ్డూ కల్తీ అపచారం తొలిగిపోయిందన్నారు. అయినప్పటికీ భక్తుల్లో ఆందోళన తొలిగించడానికి నేడు శాంతి హోం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News