'వ్యూహం' సినిమాకు టీడీపీ భయపడుతోంది -ఆర్జీవీ
కొలికపూడి ఈ వ్యాఖ్యలు చేయడంలో సదరు టీవీ ఛానల్ ఎండీకి సైతం ఈ కుట్రలో భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. కొలికపూడి, యాంకర్ సాంబశివరావు, ఛానల్ ఎండీ బీఆర్ నాయుడులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు వర్మ తెలిపారు.
'వ్యూహం' సినిమాకు తెలుగుదేశం పార్టీ భయపడుతోందని దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. నిన్న ఓ టీవీ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు.. వర్మ తల నరికి తెచ్చిన వారికి రూ. కోటి ఇస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కొలికపూడి వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.
కొలికపూడి వ్యాఖ్యలపై బుధవారం సాయంత్రం ఏపీ డీజీపీని కలిసిన రాంగోపాల్ వర్మ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓ టీవీ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న కొలికపూడి తనను చంపడానికి టీవీ లైవ్ లోనే డైరెక్ట్ గా కాంట్రాక్టు ఇచ్చారన్నారు. యాంకర్ సాంబశివరావు వారిస్తున్నా.. తనను చంపి తలతెచ్చిన వారికి కోటి రూపాయలు ఇస్తానని మూడుసార్లు అన్నారని చెప్పారు. కొలికపూడి వ్యాఖ్యల వల్ల వేరే వాళ్ళు ఇన్ స్పైర్ అయ్యే అవకాశం ఉందని వర్మ తెలిపారు.
కొలికపూడి ఈ వ్యాఖ్యలు చేయడంలో సదరు టీవీ ఛానల్ ఎండీకి సైతం ఈ కుట్రలో భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. కొలికపూడి, యాంకర్ సాంబశివరావు, ఛానల్ ఎండీ బీఆర్ నాయుడులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు వర్మ తెలిపారు.
తన తల నరికి తెచ్చిన వారికి రూ.కోటి ఇస్తానని కొలికపూడి వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడిచినప్పటికీ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఖండించలేదని చెప్పారు. తాను తెరకెక్కిస్తున్న 'వ్యూహం' సినిమాకు తెలుగుదేశం పార్టీ భయపడుతోందన్నారు. ఈ సినిమా విడుదల అవుతుందంటేనే టీడీపీ నేతలు గుమ్మడికాయల దొంగలా భుజాలు తడుముకుంటున్నారని వర్మ అన్నారు.