చంద్రబాబుకు ఇప్పుడు నొప్పి తెలుస్తోందా?

ఇప్పుడు విషయం ఏమిటంటే తనను జైలులో ఉంచటమే ధ్యేయంగా కేసుల మీద కేసులు పెడుతున్నారని భోరుమంటున్న చంద్రబాబు పదేళ్ళ క్రితం జగన్ విషయంలో ఎలా వ్యవహరించారు.

Advertisement
Update:2023-11-09 11:11 IST

‘నన్ను జైలులో ఉంచటమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏకైక ఉద్దేశం..అందుకే తనపై కేసుల మీద కేసులు పెట్టి జైలులో ఉంచేందుకు ప్లాన్ చేశారు’ ఇది హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్లో పేర్కొన్న పాయింట్. తనపై ప్రభుత్వం పెట్టిన స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ స్కామ్, అమరావతి అసైన్మెంట్ కుంభకోణం, అంగళ్ళ అల్లర్లు, ఇసుక, మద్యం స్కాంల కేసులన్నీ తనను ఇబ్బంది పెట్టడానికి పెట్టినవే అని పిటీషన్లో చంద్రబాబు భోరుమన్నారు.

చంద్రబాబు ఆరోపణల సంగతిని పక్కనపెట్టేస్తే ఇప్పటికి అరెస్టయ్యింది స్కిల్ స్కామ్‌లో మాత్రమే. దీని లోతుల్లోకి విచారణ జరగకుండా చంద్రబాబు దాఖలుచేసిన క్వాష్ పిటీషన్‌పైనే విచారణ జరుగుతోంది. అలాగే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారన్న సీఐడీ ఆరోపణలు, చూపించిన ఆధారాలతో ఏసీబీ కోర్టు, హైకోర్టు ఏకీభవించాయి. అందుకనే బెయిల్ ఇవ్వలేదు, క్వాష్ పిటీషన్ను డిస్మిస్ చేసింది. సరే మొదటి నుండి చంద్రబాబు నైజమంతే. ఓటుకు నోటు కేసులో కూడా తనకు సంబంధమే లేదని వాదిస్తున్న విషయం అందరు చూస్తున్నదే.

ఇప్పుడు విషయం ఏమిటంటే తనను జైలులో ఉంచటమే ధ్యేయంగా కేసుల మీద కేసులు పెడుతున్నారని భోరుమంటున్న చంద్రబాబు పదేళ్ళ క్రితం జగన్ విషయంలో ఎలా వ్యవహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ మీద పెట్టిన కేసుల్లో తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా ఎందుకు ఇంప్లీడ్ అయినట్లు? సోనియా-చంద్రబాబు మాట్లాడుకునే జగన్‌పై తప్పుడు కేసులు పెట్టారన్న మంత్రులు, వైసీపీ నేతల ఆరోపణలకు చంద్రబాబు సమాధానమే చెప్పలేకపోతున్నారు. జగన్‌ను జైలులో నుండి బయటకు రానీయకూడదనే కదా అప్పట్లో చంద్రబాబు ఆలోచించింది. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను లాక్కున్నది కూడా రాజకీయంగా జగన్‌ను తొక్కేసేందుకే కదా.

జగన్ మీద పెట్టిన కేసుల్లో పదేళ్ళయినా ఒక్క ఆధారాన్ని కూడా సీబీఐ, ఈడీ కోర్టులో చూపలేకపోయాయి. కానీ చంద్రబాబు అవినీతికి సీఐడీ కావాల్సినన్ని ఆధారాలును కోర్టులో ప్రొడ్యూస్ చేసిందికదా. చంద్రబాబు అవినీతికి ప్రాథ‌మిక ఆధారాలున్నాయని ఏసీబీ కోర్టు వ్యాఖ్యానించిన విషయం అందరికీ తెలిసిందే. ఆధారాలు లేకుండానే జగన్‌పై కేసులు పెట్టినపుడు మరి ఆధారాలతో సహా సీఐడీ కేసులు పెట్టడాన్ని చంద్రబాబు తప్పుడు కేసులని ఎలా అంటున్నారు? తనదాకా వస్తే కానీ నొప్పి తెలీదని పెద్దలు ఊరికే అన‌లేదు.


Tags:    
Advertisement

Similar News