ఇద్ద‌రూ చెంపలేసుకున్నట్లేనా?

జగన్ సంక్షేమ ప‌థ‌కాలు అమలు చేస్తుంటే ఏపీ శ్రీలంకలాగ అయిపోతోందని గోల చేసిన చంద్రబాబు, పవన్‌లు ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాల కన్నా మరింత ఎక్కువగా అమలు చేస్తామని చెబుతున్నారు.

Advertisement
Update:2023-08-16 10:59 IST

ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకలా అయిపోతోందని ఆ మధ్య చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, ఎల్లో మీడియా చేసిన గోల అందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోందని నానా గోల చేశారు. శ్రీలంకతో ఏపీని పోల్చుతు ఎల్లో మీడియా ప్రతిరోజు కథనాలు వండి వార్చేవారు. శ్రీలంక పరిస్థితులపై ప్రత్యేకమైన కథనాలను అచ్చేశారు, డిబేట్లు పెట్టారు. చంద్రబాబు ఒకవైపు పవన్ మరోవైపు రాష్ట్రంలో పర్యటించి జగన్‌పై దుమ్మెత్తిపోశారు. వీళ్ళు బురదచల్లేయటమే కాకుండా నిపుణులపేరుతో ఎవరెవరినో పట్టుకొచ్చి మాట్లాడించారు.

సీన్ కట్ చేస్తే టీడీపీ అధికారంలోకి వస్తే ఇప్పటికన్నా సంక్షేమ పథకాలు మరింతగా అమలు చేస్తామని చంద్రబాబు హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. రాజమండ్రిలో జరిగిన మహానాడు సందర్భంగా మినీ మ్యానిఫెస్టోను కూడా ప్రకటించారు. అందులో అంతా సంక్షేమ పథకాల హామీలే ఉన్నాయి. తాజాగా ఉత్తరాంధ్రలో వారాహి యాత్ర చేస్తున్న పవన్ మాట్లాడుతూ.. జగన్ ఓడిపోయినంత మాత్రాన సంక్షేమ పథకాలేమీ ఆగిపోవన్నారు. జగన్ ఓడిపోతే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయేమో అనే భయం వద్దని లబ్ధిదారులకు భరోసా ఇచ్చారు.

ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపమని పైగా జాతీయ నాయకుల పేర్లతో మరిన్ని కొత్త పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. జగన్ సంక్షేమ ప‌థ‌కాలు అమలు చేస్తుంటే ఏపీ శ్రీలంకలాగ అయిపోతోందని గోల చేసిన చంద్రబాబు, పవన్ ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాల కన్నా మరింత ఎక్కువగా అమలు చేస్తామని ఎలా చెబుతున్నారు? సంక్షేమ పథకాలను వాళ్ళు అమలు చేస్తే ఏపీ శ్రీలంకలా అయిపోదా?

ఇక్కడే వాళ్ళ ఆరోపణల్లోని డొల్లతనం బయటపడింది. ఇంతకాలం జగన్‌పై తాము చేసిన ఆరోపణలు, విమర్శలన్నీ తప్పుడువని అంగీకరించినట్లయ్యింది. పథకాల అమలు విషయంలో ఇద్ద‌రూ యూటర్న్ తీసుకుని చెంపలేసుకున్నారు. మరి తప్పుడు కథనాలు అచ్చేసినందుకు ఎల్లో మీడియా ఎప్పుడు చెంపలేసుకుంటుందో చూడాలి. ఇంతకీ వీళ్ళు యూటర్న్ తీసుకోవటానికి కారణం ఏమిటంటే గ్రౌండ్ లెవల్ నుండి అందిన ఫీడ్ బ్యాకే. సంక్షేమ పథకాలపై చంద్రబాబు, పవన్ చేసిన ఆరోపణలు, విమర్శల కారణంగా పథకాల లబ్ధిదారుల్లో అభద్రత మొదలైందట. వీళ్ళు అధికారంలోకి వస్తే పథకాలన్నింటినీ నిలిపేస్తారనే భయం పెరిగిపోతోందట. ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా గ్రహించిన అధినేతలిద్దరు వెంటనే యూటర్న్ తీసుకున్నారట.

Tags:    
Advertisement

Similar News