పరామర్శా..? రాజకీయమా..?? చంద్రబాబు ఇంటికి పవన్
ఇది రాజకీయ భేటీ అని విమర్శలు వినపడుతున్నా.. అనారోగ్యంగా ఉన్న వ్యక్తికి పరామర్శ మాత్రమే అని టీడీపీ కవర్ చేసుకుంటోంది. చంద్రబాబుని పవన్ కలిస్తే ఓ రేంజ్ లో ప్రచారం చేసుకోవడం రెండు పార్టీలకు అలవాటు. కానీ ఎల్లో మీడియాకి కూడా ఫొటోలు తీసుకునే అవకాశం ఇవ్వకపోవడం ఇక్కడ విశేషం.
మీకు బెయిలిచ్చింది దేనికోసం..? మీరు చేస్తున్నదేంటి..? అంటూ ఇటీవల హైకోర్టు చంద్రబాబుకి, ఆయన తరపు లాయర్లకు చీవాట్లు పెట్టినా పరిస్థితిలో ఏ మార్పు లేదు. పరామర్శల పేరుతో రాజకీయం మొదలెట్టారు చంద్రబాబు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి జనసేనాని పవన్ కల్యాణ్ వెళ్లి పరామర్శించారు. పవన్ వెంట నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఇది రాజకీయ భేటీ అని విమర్శలు వినపడుతున్నా.. అనారోగ్యంగా ఉన్న వ్యక్తికి పరామర్శ మాత్రమే అని టీడీపీ కవర్ చేసుకుంటోంది. చంద్రబాబుని పవన్ కలిస్తే ఓ రేంజ్ లో ప్రచారం చేసుకోవడం రెండు పార్టీలకు అలవాటు. కానీ ఎల్లో మీడియాకి కూడా ఫొటోలు తీసుకునే అవకాశం ఇవ్వకపోవడం ఇక్కడ విశేషం.
చంద్రబాబు బెయిల్ పై బయటకొచ్చాక సవాలక్ష కండిషన్లు అంటూ హడావిడి మొదలైంది. ఆయన ఆస్పత్రిలో ఉండాలని, లేదంటే ఇంట్లో ఉండాలని, ఫోన్లో మాట్లాడకూడదని, ర్యాలీల్లో పాల్గొనకూడదని, రాజకీయ సభలు, సమావేశాలు, చర్చలు ఏర్పాటు చేయకూడదని, సాక్షుల్ని ప్రభావితం చేయకూడదని పగడ్బందీగా నిబంధనలు పెట్టింది కోర్టు. కానీ జైలు బయటకు రాగానే చంద్రబాబు మైకు అందుకున్నారు. తాను ఎంత నిజాయితీ పరుడినో చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ర్యాలీలు, స్వాగతాలు, హడావిడి అందరికీ తెలిసిందే. ఇదే విషయమై పెన్ డ్రైవ్ లో ఆధారాలను కోర్టుకి సబ్మిట్ చేసింది సీఐడీ. డీఎస్పీ స్థాయి అధికారులతో నిఘా అవసరం లేదని చెప్పిన కోర్టు.. అదే సమయంలో నిబంధనలు కచ్చితంగా పాటించాలంటూ చంద్రబాబు తరపు లాయర్లకు స్పష్టం చేసింది.
అడుగడుగునా ఉల్లంఘనలు..
చంద్రబాబు జైలునుంచి విడుదలైన సమయంలో పవన్ కల్యాణ్ ఇటలీలో ఉన్నారు. వరుణ్ తేజ్ వివాహానికి హాజరయ్యేందుకు ఆయన కుటుంబ సభ్యులతో కలసి ఇటలీ వెళ్లారు. అక్కడి నుంచి వచ్చీ రాగానే చంద్రబాబుని పరామర్శించడానికి ఆయన ఇంటికెళ్లారు. ఇక చంద్రబాబు శుక్రవారం గచ్చిబౌలిలోని ఆసియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) లో వివిధ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రెండు రోజుల తర్వాత ఆయన ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంది.
♦